దుబాయ్‌లో బైక్ రైడర్‌కు రూ.4,000 దిర్హమ్స్ జరిమానా..!!
- August 16, 2026
దుబాయ్: రోడ్డుపై బైక్ నడుపుతూ అకస్మాత్తుగా సైడ్‌కు మళ్లడంతో అదుపుతప్పి ప్రమాదానికి కారణమైన ఓ రైడర్‌కు దుబాయ్ ట్రాఫిక్ కోర్టు 4,000 దిర్హమ్స్ జరిమానా విధించింది. అలాగే అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని ఆదేశించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. దుబాయ్‌లోని ఓ ప్రాంతంలో మోటార్‌సైకిల్ ప్రమాదం జరిగినట్లు పోలీసు ఆపరేషన్స్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రైడర్ అకస్మాత్తుగా బైక్‌ను పక్కకు మళ్లించడంతో అదుపుతప్పి బైక్ బోల్తా పడినట్లు గుర్తించారు.
రైడర్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అకస్మాత్తుగా బైక్‌ను మళ్లించడం వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మోటార్‌సైకిల్ రిజిస్ట్రేషన్ 2025 నవంబర్‌లోనే గడువు ముగిసింది. అంతేకాకుండా ప్రమాదం జరిగిన సమయానికి బైక్‌కు తప్పనిసరి ఇన్సూరెన్స్ కూడా చెల్లుబాటులో లేదు.
విచారణ సందర్భంగా రైడర్ తన తప్పును అంగీకరించాడు. పోలీసు నివేదిక, ప్రమాద స్థల స్కెచ్, రైడర్ అంగీకారాన్ని పరిశీలించిన కోర్టు.. మొత్తం 4,000 దిర్హమ్స్ జరిమానా విధిస్తూ.. డ్రైవింగ్ ను లైసెన్స్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది.
తాజా వార్తలు
- 30 ఏళ్లలోనే మెనోపాజ్‌కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!
- పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా?
- భారత్–యూఏఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని IBPC పిలుపు
- ఒమన్ తీరంలో ఆయిల్ కాలుష్యం.. 12 కిలోమీటర్ల మేర ప్రభావం..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మెనూల్లో క్యాలరీల వివరాలకు కొత్త విధానం..!
- ప్రపంచ శాంతి సందేశంతో 135 దేశాల పర్యటన.. 600 రోజుల్లో 2.5 లక్షల కిలోమీటర్లు..!!
- దుబాయ్‌లో బైక్ రైడర్‌కు రూ.4,000 దిర్హమ్స్ జరిమానా..!!
- ఇండోనేషియాలో భారీ భూకంపం.. 47కి చేరిన మరణాలు
- గుడ్‌న్యూస్.. ఖతార్ నుంచి భారత్‌కు మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రారంభం..!!







