ప్రపంచ శాంతి సందేశంతో 135 దేశాల పర్యటన.. 600 రోజుల్లో 2.5 లక్షల కిలోమీటర్లు..!!

- August 16, 2026 , by Maagulf
ప్రపంచ శాంతి సందేశంతో 135 దేశాల పర్యటన.. 600 రోజుల్లో 2.5 లక్షల కిలోమీటర్లు..!!

కువైట్: ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్నేహం, ఐక్యత సందేశాన్ని చాటిచెప్పేందుకు మలయాళీ మణికుట్టన్ జీఎస్ అంతర్జాతీయ రోడ్ జర్నీకి శ్రీకారం చుట్టారు. కొత్త ప్రపంచ రికార్డు లక్ష్యంగా చేపట్టిన ఈ సాహసయాత్రకు వరల్డ్ మలయాళీ కౌన్సిల్ (WMC) కువైట్ ప్రావిన్స్ మద్దతు ప్రకటించింది. భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న కువైట్ టవర్స్ నుంచి ఈ యాత్రను One Man, One Car, One Dream — Peace అనే నినాదంతో మణికుట్టన్ కొనసాగించనున్నారు.

135 దేశాలు.. 600 రోజులు

తన ప్రయాణంలో 135 దేశాలను 600 రోజుల్లో చుట్టి రావాలని మణికుట్టన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 2.5 లక్షల కిలోమీటర్లు కారులో ప్రయాణించనున్నారు. వివిధ దేశాలు, భిన్న సంస్కృతులు, ప్రజల మధ్య స్నేహం, శాంతి, సామరస్యాన్ని పెంపొందించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఇప్పటికే 11 ప్రపంచ రికార్డులు

కేరళలోని తిరువనంతపురం జిల్లా చెరియకొన్నీకి చెందిన 53 ఏళ్ల మణికుట్టన్‌కు ఇప్పటికే పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. 2023లో ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఇప్పటివరకు ఆయన ఖాతాలో 11 ప్రపంచ రికార్డులు, ఒక అవార్డు ఉన్నది. 2023లో ఒకే దేశంలో కారులో అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తిగా ఆయన గిన్నిస్ రికార్డు సాధించారు. అమెరికాకు చెందిన*జిమ్ రోజర్స్, పైజ్ పార్కర్ మూడు సంవత్సరాల్లో 116 దేశాల్లో పర్యటించిన రికార్డును అధిగమించడమే తాజా యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com