ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు BD15 ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ప్రతిపాదన..!!
- August 17, 2026
మనామా: బహ్రెయిన్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గించేందుకు కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఉద్యోగులకు నెలకు కనీసం BD15 ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అందించేలా కార్మిక చట్టంలో సవరణ చేయాలని ఎంపీ జలాల్ కాధెమ్ ప్రతిపాదించారు.
ప్రైవేట్ సంస్థ ఇప్పటికే ఉద్యోగులకు ఇంటి నుంచి కార్యాలయానికి, తిరిగి ఇంటికి రవాణా సౌకర్యం కల్పిస్తే ఈ అలవెన్స్ వర్తించదు. మిగతా ఉద్యోగులకు నెలకు కనీసం BD15 చెల్లించేలా చట్టాన్ని సవరించాలని ఆయన కోరారు.
ప్రైవేట్ రంగ ఉద్యోగులు పెరుగుతున్న ఇంధనం, ప్రయాణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నారని కాధెమ్ పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల్లో పెద్దగా మార్పు లేకపోవడంతో.. రవాణా ఖర్చులు వారి కుటుంబ బడ్జెట్‌పై అదనపు భారంగా మారాయని తెలిపారు. ప్రస్తుత 2012లోని లా నంబర్ 36లోని ఆర్టికల్ 10కు సవరణలు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు
ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కనీసం BD20 ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లభిస్తోందని కాధెమ్ తెలిపారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు BD15 ఇవ్వడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల మధ్య ప్రయోజనాల వ్యత్యాసాన్ని కొంతవరకు తగ్గించవచ్చన్నారు. ఈ అలవెన్స్ వల్ల ఉద్యోగుల ప్రాథమిక వేతనం కుటుంబ అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడుతుందని, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు బహ్రెయిన్ పౌరులకు మరింత ఆకర్షణీయంగా మారుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు యజమానులు తగిన రవాణా సౌకర్యం కల్పించాల్సిన నిబంధన ఉంది. ప్రతిపాదిత సవరణలో ఈ బాధ్యతను కొనసాగిస్తూనే.. సంస్థ నుంచి రవాణా సౌకర్యం పొందని ఉద్యోగులకు BD15 నెలవారీ అలవెన్స్ చెల్లించేలా నిబంధన తీసుకురావాలని కాధెమ్ కోరారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







