సముద్రంలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించిన బోర్డర్ గార్డ్..!!
- August 17, 2026
యాన్బు: సముద్రంలో పడవ మొరాయించడంతో చిక్కుకుపోయిన ఐదుగురు సౌదీ పౌరులను బోర్డర్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. మదీనా ప్రాంతంలోని యాన్బు గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పడవ సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అందులో ఉన్న ఐదుగురు పౌరులు సహాయం కోసం కాల్ చేశారు. సమాచారం అందుకున్న బోర్డర్ గార్డ్‌కు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.
సముద్రంలోకి వెళ్లే ముందు తమ పడవలు ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ సూచించింది. సముద్ర భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలు, సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలని కోరింది.
సముద్రంలో అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న వారు సహాయం కోసం మక్కా, మదీనా, తూర్పు ప్రావిన్స్‌లలో 911కు.. మిగిలిన ప్రాంతాల్లో అత్యవసర సహాయం కోసం 994కు ఫోన్ చేయాలని బోర్డర్ గార్డ్ తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







