నేటితో అమెరికా-ఇరాన్ 60 రోజుల ఒప్పందం పూర్తి
- August 17, 2026
అమెరికా: నెలల తరబడి సాగిన తీవ్ర సైనిక పోరాటానికి తెరదించుతూ అమెరికా, ఇరాన్‌ల మధ్య జూన్ 17న కుదిరిన చారిత్రాత్మక 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం (MoU) ఆగస్టు 17, సోమవారంతో అధికారికంగా ముగిసింది. శాశ్వత శాంతి ఒప్పందమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సంతకాలు చేసిన ఈ ఒప్పందం.. గడువు ముగియడానికి ముందే పూర్తిగా విఫలమై రద్దయ్యే దిశగా చేరుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటుగా.. పశ్చిమాసియా ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి.
$300 బిలియన్ల పునర్నిర్మాణ ప్యాకేజీ
జూన్ 17 ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తక్షణమే సైనిక చర్యలను నిలిపివేసి 60 రోజుల్లోగా సమగ్ర ఒప్పందాన్ని రూపొందించుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా అమెరికా 30 రోజుల్లో నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తూ.. ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను సడలించడం, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, $300 బిలియన్ల పునర్నిర్మాణ ప్యాకేజీని అందించడానికి అంగీకరించింది. ప్రతిగా, ఇరాన్ హార్ముజ్ జలసంధిలోని మైన్లను తొలగించి వాణిజ్య నౌకల ప్రయాణానికి అనుమతించడంతో పాటు.. అణ్వాయుధాలు తయారు చేయబోమని పునరుద్ఘాటించాల్సి ఉంది. అయితే ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే పరస్పర ఆరోపణలతో ఇరు పక్షాలు తమ కట్టుబాట్ల నుంచి తప్పుకున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవలేదని అమెరికా ఆరోపించగా.. దిగ్బంధనం ఆంక్షల ఎత్తివేత వాగ్దానాలను అమెరికా నెరవేర్చలేదని ఇరాన్ విమర్శించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







