యూఏఈలో కొనసాగుతున్న ఎండల తీవ్రత..వర్షాలు పడే అవకాశం..!!
- August 18, 2026
యూఏఈ: యూఏఈలో నేడు వాతావరణం సాధారణంగా పాక్షిక మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరాలజీ (NCM) తెలిపింది. మధ్యాహ్నం తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వర్షాన్ని సూచించే మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయం నుంచి ఈశాన్య దిశగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి నుంచి మోస్తరు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు యూఏఈలో వేసవి తీవ్రత కొనసాగుతోంది. అబుదాబిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌కు, దుబాయ్, షార్జాలో 45 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 32, 34, 31 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 24న సుహైల్ నక్షత్రం ఉదయించడంతో యూఏఈలో గరిష్ఠ వేసవి కాలం క్రమంగా ముగిసే దశ ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గకుండా.. రానున్న రోజుల్లో క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







