మీ పేరుపై ఉన్న ఫోన్ నంబర్లను తెలుసుకోవచ్చు.. ‘సహల్’లో కొత్త సర్వీస్..!!
- August 18, 2026
కువైట్: మీ పేరుపై ఎన్ని మొబైల్ నంబర్లు, టెలికమ్యూనికేషన్ సేవలు నమోదై ఉన్నాయో ఇక సులభంగా తెలుసుకోవచ్చు. కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (CITRA) ‘సహల్’ ప్రభుత్వ సేవల యాప్‌లో ‘మై నంబర్స్’ పేరుతో కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం సంస్థల సహకారంతో ప్రారంభించిన ఈ సేవ ద్వారా పౌరులు, నివాసితులు తమ పేరుపై వివిధ టెలికాం ఆపరేటర్ల వద్ద నమోదైన అన్ని ఫోన్ నంబర్లు, కమ్యూనికేషన్ సేవలను ఒకే చోట చూసుకోవచ్చు.
వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలను సులభంగా ధృవీకరించుకోవడంతో పాటు డిజిటల్ అవగాహన పెంచడం, పారదర్శకతను మెరుగుపరచడం, వ్యక్తిగత డేటా గోప్యతకు మరింత రక్షణ కల్పించడం ఈ సేవ ప్రధాన ఉద్దేశమని CITRA తెలిపింది. తమ పేరుపై నమోదైన ఫోన్ నంబర్లను ‘సహల్’ యాప్ ద్వారా పరిశీలించాలని అధికారులు సూచించారు. వ్యక్తిగత సమాచారం సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడంతో పాటు, తమ అనుమతి లేకుండా ఏదైనా నంబర్ నమోదై ఉంటే గుర్తించేందుకు ఈ సేవ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







