డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల ఉల్లంఘనపై సౌదీ కఠిన చర్యలు..!!
- August 18, 2026
రియాద్: డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల ఉల్లంఘనపై సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. వికలాంగుల సంరక్షణ అథారిటీ (APD) నిబంధనలు ఉల్లంఘించే ప్రభుత్వేతర సంస్థలపై తనిఖీలు, పర్యవేక్షణతో పాటు జరిమానాలు విధించే అధికారాలను నేరుగా అమలు చేయడం ప్రారంభించింది. డిసబుల్డ్ పర్సన్స్ హక్కుల చట్టంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు APD వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు గరిష్ఠంగా SR500,000వరకు జరిమానా విధించనున్నారు. అదే తప్పును మళ్లీ చేస్తే జరిమానాను రెట్టింపు చేయనున్నారు.
డిసబుల్డ్ పర్సన్స్ చట్టం కల్పించిన హక్కులు, సేవలను నిరాకరించడం, వారి పట్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వివక్ష చూపే విధానాలను అవలంబించడం వంటి వాటిని తీవ్రమైన ఉల్లంఘనలుగా పరిగణించనున్నారు. అలాగే డిసబుల్డ్ పర్సన్స్ తమ చట్టపరమైన వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించకుండా అడ్డుకోవడం, విద్య, శిక్షణ, వైద్యం, బీమా, ఆర్థిక సేవలు, రవాణా వంటి సౌకర్యాలను నిరాకరించడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని APD స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు సహా ప్రభుత్వేతర సంస్థల్లో ఈ నిబంధనలు అమలయ్యేలా తనిఖీలు, పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తామని అథారిటీ తెలిపింది. డిసబుల్డ్ పర్సన్స్ కు ఇతరులతో సమానంగా సేవలు, అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







