మోహన్ లాల్ సంచలన ప్రకటన: ఒకేసారి ఏడు కొత్త ప్రాజెక్ట్‌లు..!
- August 18, 2026
మలయాళ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరో అయిన మోహన్ లాల్, తన 66 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం జోరు తగ్గించకుండా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. తాజాగా ఆయన సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టిస్తూ, ఏకంగా ఏడుగురు ప్రముఖ దర్శకులతో కొత్త ప్రాజెక్ట్‌లను (Mohanlal ) ఒకేసారి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఫిల్మ్‌మేకర్స్‌తో కలిసి ఎగ్జైటింగ్ స్టోరీలు:
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. అత్యంత ప్రత్యేకమైన ఫిల్మ్‌మేకర్స్‌తో కలిసి ఎగ్జైటింగ్ స్టోరీలు, ఆసక్తికరమైన ప్రయాణాలకు సిద్ధమవుతున్నానని పేర్కొన్నారు. ఈ లైనప్‌లో మలయాళ చిత్రసీమలోని దిగ్గజ దర్శకులతో పాటు యువ టాలెంటెడ్ డైరెక్టర్లు కూడా ఉండటం విశేషం.
ఈ ప్రతిష్టాత్మక లైనప్‌లో సంచలనాత్మక చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రియదర్శన్, విష్ణు మోహన్, అనూప్ సత్యన్, దిలీశ్ పోతన్, సత్యాన్ అంతిక్కాడ్, అలాగే జూడ్ ఆంథనీ జోసెఫ్ ఉన్నారు. వీరిలో కొంతమందితో ఆయన గతంలో బ్లాక్‌బస్టర్ హిట్లు ఇవ్వగా, మరికొందరితో తొలిసారి కలిసి పనిచేస్తున్నారు.
సీనియర్ దర్శకుల అనుభవం, యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ల కొత్త ఆలోచనలతో ఈ ప్రాజెక్ట్‌లన్నీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. భిన్నమైన కథాంశాలు, విభిన్న జోనర్లతో సాగే ఈ చిత్రాల ద్వారా మోహన్ లాల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఒకేసారి ఏడుగురు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేయడం ద్వారా ఆయన తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ఈ వార్తతో మోహన్ లాల్ అభిమానులు సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







