‘సిగ్మా’ విడుదల
- August 18, 2026
యువ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్, అడ్వెంచర్ అండ్ హీస్ట్ థ్రిల్లర్ చిత్రం ‘సిగ్మా’. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ పోస్టర్‌ను పంచుకుంది.
దర్శకుడిగా జేసన్ సంజయ్ అరంగేట్రం
ఈ సినిమా ద్వారా స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. సరికొత్త ట్రెజర్ హంట్ మరియు హీస్ట్ అంశాలతో కూడిన విభిన్నమైన కథాంశంతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’ సుభాస్కరన్ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన స్వరాలు సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ప్రస్తుతం విఎఫ్ఎక్స్, ఎడిటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని మేకర్స్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







