డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- August 19, 2026
మనామా: డేటింగ్ యాప్ ద్వారా 35 ఏళ్ల ఆసియా వ్యక్తిని వలలోకి దింపి, అతడిపై దాడి చేసి ఎలక్ట్రిక్ బైక్‌ను దోచుకున్నారనే ఆరోపణలతో 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు యువకులపై కేసు నమోదైంది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రకారం.. జూన్ 17న బాధితుడు తన ఎలక్ట్రిక్ బైక్‌పై రోడ్డుపై వెళ్తుండగా నిందితులు అతడిని అడ్డుకున్నారు. అనంతరం దాడి చేసి ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో బాధితుడికి గాయాలైనట్లు వైద్య నివేదిక ధ్రువీకరించింది.
దర్యాప్తులో ఓ నిందితుడు కీలక విషయాలను వెల్లడించాడు. డేటింగ్ యాప్ ద్వారా బాధితుడిని నిర్దేశిత ప్రాంతానికి రప్పించేందుకు తాము ముందుగానే పథకం వేసుకున్నామని చెప్పాడు. మూడో, నాలుగో నిందితులు కూడా బాధితుడిపై దాడి చేసినట్లు అంగీకరించారు. నలుగురూ ఘటనలో తమ ప్రమేయాన్ని అంగీకరించినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ కేసును విచారిస్తున్న హై క్రిమినల్ కోర్టు ఫస్ట్ సర్క్యూట్ తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







