పాముకాటు నుంచి రక్షించబడిన కొమొరోస్ జాతీయుడు

- August 17, 2016 , by Maagulf
పాముకాటు నుంచి రక్షించబడిన  కొమొరోస్ జాతీయుడు

రాస్ అల్ ఖైమాహ్ :  కారులోంచి కాలు బైట పెట్టడంతోనే...సరిగ్గా అందుకోసమే కాచుకొని ఉన్నట్లుగా ఒక మీటరు పొడవైన  ప్రమాదకర విషపాము ఆ వ్యక్తిని కాటువేసింది. దీనితో లబోదిబోమంటున్న బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక రాస్ అల్ ఖైమాహ్  సోహిళ  ప్రాంతంలో నివాసం ఉంటున్న 32 ఏళ్ల  కొమొరోస్ జాతీయుడైన అస్లాం కైనాకు ఈ చేదు మంగళవారం రాత్రి అనుభవం ఎదురైంది. బాధితుడిని వెంటనే రాస్ అల్ ఖైమాహ్ లోని ఇబ్రహీం బిన్ హమద్ ఉబైదుల్లాహ్  ప్రభుత్వ ఆస్పత్రిలోని  అత్యవసర విభాగంలో చేర్పించారు. పాముకాటుతో అల్లాడిపోతున్న బాధితుడిని కుటుంబం సభ్యులు అదే కారులో వేగంగా చికిత్స కోసం  ఆసుపత్రికి తరలించడంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. అక్కడ వైద్యులు తక్షణ వైద్యం బాధితునికి అందడంతో ప్రమాదకరమైన పామువిషం అతని అంతం చేయలేకపోయింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com