బహ్రెయిన్‌కి వీడ్కోలు: మల్టీ టాలెంటెడ్ జిజు
- August 17, 2016
17 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్తానంలో ఎన్నో మైలు రాళ్ళను అధిగమించిన భారతీయ వలసదారుడు జిజు వెర్గీస్, స్వదేశానికి పయనమవుతున్నారు కుటుంబ సమేతంగా బహ్రెయిన్ నుంచి. అర్థర్ అండర్సన్ కన్సల్టింగ్‌లో బిజినెస్ కన్సల్టెంట్ - ఇపిర్ స్పెషలిస్ట్‌గా జాయిన్ అయిన జిజు, బహ్రెయిన్ ఫ్లోర్ మిల్స్ కంపెనీకి ఐటీ మేనేజర్‌గా గత 16 ఏల్ళుగా సేవలందించారు. యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (వైఎంసిఎ) బహ్రెయిన్‌కి ఫౌండర్ జనరల్ సెక్రెటరీగా పనిచేశారు జిజు. చర్చ్‌కి సంబంధించిన కార్యక్రమాల్ని, డిఫరెంట్ ప్రాజెక్టుల్ని నిర్వహించారు. స్ట్రాంగర్ కిడ్స్, స్ట్రాంగర్ ఫ్యామిలీస్, స్ట్రాంగర్ కమ్యూనిటీస్ అనే మోటోతో వైఎంసిఎను నిర్వహించినట్లు తెలిపారాయన. పబ్లిక్ స్పీకింగ్‌లో ఆయన పలు అవార్డుల్ని, గుర్తింపుని సొంతం చేసుకున్నారు. 2006 నుంచి పలు రేడియో షోస్ కూడా చేశారు. టాక్ షోస్, డిబేట్స్, మ్యూజిక్ షోస్‌ని కూడా నిర్వహించారాయన. చారిటీ కార్యక్రమాల నిర్వహణలోనూ జిజు ముందుండేవారు. పలు కంపెనీలు నిర్వహించిన మోటివేషనల్ ప్రోగ్రామ్స్‌లో కూడా పాల్గొన్నారు జిజు. పలు బ్రాండ్స్‌కి, మల్టీ నేషనల్ కంపెనీలకి, ప్రోడక్ట్స్, సర్వీసులకు తన వాయిస్‌ని కూడా అందించారు. జిజు సతీమణి సీనా, వృత్తి పరంగా లాయర్. వీరి కుమార్తె రెబెక్కా ఇండియన్ స్కూల్ బహ్రెయిన్‌లో 8వ గ్రేడ్ చదువుతోంది. వైఎంసిఏ ప్రెసిడెంట్ సోమన్ బేబీ, జిజుకి ఘనంగా ఫేర్‌వెల్ కార్యక్రమంలో వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







