రాఖీ పౌర్ణమి ....రక్షణకు హామీ ఇస్తున్నా....!

- August 17, 2016 , by Maagulf

ముందుగా  "  మా గల్ఫ్.కామ్ "  పాఠకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.. !!
రాఖీ పౌర్ణమి పండుగ ఒక సోదరుడు, సోదరిల మధ్య పవిత్ర  బంధంగా జరుపుకుంటారు. ‘రాఖీ' అంటే రక్షించటమని చెపుతారు.రాఖీ పౌర్ణమి పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజు ఆగస్టు నెలలో వస్తుంది. ఈ రోజున ఒక సోదరి రాఖీ అనే పవిత్ర తోరాణాన్ని తన సోదరుడి మణికట్టుకు కట్టి అతడు సంతోష ఆనందాలతో అన్ని రంగాలలోను విజయం పొందాలని, సోదరుడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. అది ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా, ఒక సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది. చరిత్ర పుటలలో ఈ రాఖీ పండుగ ప్రాధాన్యతను పరిశీలిస్తే.... రాణి కర్ణావతి మరియు చక్రవర్తి హుమయూన్ చరిత్రలో ఉంది. ఈ పండుగ రాణి కర్ణావతి మరియు చక్రవర్తి హుమయూన్ ల మధ్య సోదరీ సోదరుల పండుగగా రాఖీ పౌర్ణమి కట్టటం జరిగింది. మధ్య యుగంలో రాజపుత్రులు ముస్లిం రాజులనుండి దండయాత్రలను ఎదుర్కొనేవారు. చిత్తూర్ రాణి కర్ణావతి తన రాజ్యాన్ని గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుండి రక్షించుకోటానికి సోదరిని రక్షించే రాఖీ ని చక్రవర్తి హుమయూన్ కు పంపింది. ఆమె చేసిన ఈ చర్యకు చక్రవర్తి హుమయూన్ గుండె కరిగింది. ఇక అంతే హుమయూన్ తన సైన్యాలను తీసుకొని వెంటనే వెళ్ళి ఆమె రాజ్యాన్ని గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుండి కాపాడాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు రాజు పురుషోత్తముడు చరిత్రలో మరో పుట తిరగేస్తే, క్రీ. పూ. 300 సంవత్సరంలో మాసిడోనియా రాజు అలెగ్జాండర్ ఇండియాపై దండెత్తాడు. రాజు పురుషోత్తముడు అతడిని ఎదుర్కొన్నాడు. అయితే, పరిస్ధితిని గమనించిన అలెగ్జాండర్ భార్య రాజు పురుషోత్తముడికి రాఖీ కట్టింది. అంతే, రాజు ఆమెను ఒక సోదరిగా ఆమోదించాడు. జరిగిన యుద్ధంలో అవకాశం వచ్చినప్పటికి పురుషోత్తముడు అలెగ్జాండర్ నుండి రక్షించబడ్డాడు. ఇండియాలోని ప్రతి పండుగకు ఒక మతపర విశేషం ఉంటుంది. అది దేవతలకు సంబంధించినదిగా కూడా ఉంటుంది. శ్రీ క్రిష్ణుడు మరియు ద్రౌపతి శిశుపాలుడితో జరిగిన ఒక యుద్ధంలో    శ్రీ కృష్ణుని  చేతి వేలికి గాయం చేసుకుంటాడు. రక్తం బాగా కారుతూంటే, అక్కడే ఉన్న ద్రౌపతి తన చీర కొంగు చించి అతని వేలికి కడుతుంది. అపుడు శ్రీ క్రిష్ణుడు ఆమెను సోదరి సమానురాలిగా భావించి ఆమె కట్టిన చీర కొంగును రక్షాబంధనంగా భావించి ఆమెను తదుపరి రోజులలో కౌరవులు చేసిన వస్త్రాపహరణం నుండి రక్షిస్తాడు. బలి చక్రవర్తి, లక్ష్మీ దేవి రాక్షసుల రాజు మహాబలి తన భక్తితో విష్ణువును మెప్పించి తన రాజ్య రక్షణా భారం విష్ణువుపై పెడతాడు. దానితో విష్ణువు బలి రాజ్యంలోనే ఉండిపోవలసి వస్తుంది. అపుడు విష్ణవు భార్య అయిన లక్ష్మీ దేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్దకు వచ్చి శ్రావణ పూర్ణిమ రోజున బలి చేతికి రాఖీ కట్టి నేను నీ సోదరి సమానురాలను అంటుంది. సోదరిగా తన కోరిక మేరకు విష్ణువును వదలివేయమంటుంది. ఆమె కట్టిన రాఖీ చర్యకు మెచ్చిన బలి శ్రీ మహావిష్ణువును ఆమెతో పాటు శ్రీ మహా విష్ణువును కూడా వైకుంఠానికి పంపేస్తాడు. సైనిక సిబ్బంది - మన దేశ సైన్యం నిరంతరం మన దేశ సరిహద్దుల రక్షణా భారం చేపడుతూంటుంది. సరిహద్దు ప్రాంతాల గ్రామాల బాలికలు, మన సైనిక సిబ్బందిని తమ సోదరులుగా భావిస్తూ, వారికి రక్షా బంధన్ పండుగ రోజున రాఖీలు కడతారు. మన దేశ ప్రజలను శత్రువలనుండి రక్షించవలసినదిగా కోరతారు. ఇండియాలో జరిగే వివిధ సాంప్రదాయక పండుగలలో రాఖీ పౌర్ణమి పండుగ ఒకటి. సోదరీ సోదరుల మధ్య గల అనుబంధాన్ని ఆచరించే పండుగగా ఇది ఏర్పడింది. కష్టంలోను, సుఖంలోను మీకు ఒక సోదరుడిగా మేము ఉన్నాము...అంటూ చాలామంది పురుషులు, తాము సోదరి సమానంగా భావించే స్త్రీలకు రాఖీలు కట్టటం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com