బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్

- August 20, 2026 , by Maagulf
బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) సీనియర్ నేత మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంఘీర్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి, మాజీ కల్నల్ ఓలీ అహ్మద్‌పై విజయం సాధించారు.

ఆలంఘీర్‌కు 255 ఓట్లు
ఈ ఎన్నికల్లో మొత్తం 343 మంది చట్టసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించారు. ఆలంఘీర్‌కు 255 ఓట్లు లభించగా.. ఓలీ అహ్మద్‌కు 88 ఓట్లు వచ్చాయి. దీంతో స్పష్టమైన మెజారిటీతో ఆలంఘీర్ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు.

మూడు దశాబ్దాల తర్వాత పోటీతో ఎన్నిక
1991 తర్వాత బంగ్లాదేశ్‌లో పోటీ పద్ధతిలో అధ్యక్ష ఎన్నిక జరగడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పటివరకు అధ్యక్షుడిగా కొనసాగిన మహమ్మద్ షహాబుద్దీన్ ఆరోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో ఆలంఘీర్ విజయం సాధించారు.

శుక్రవారం ప్రమాణ స్వీకారం
నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంఘీర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టడంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com