కువైట్‌లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!
- August 20, 2026
కువైట్: కువైట్‌లో కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు కొరడా ఝళిపించారు. షుబ్రా అల్-జలీబ్ మార్కెట్లో నిర్వహించిన తనిఖీల్లో 100 కిలోల గుర్తుతెలియని మీట్ ను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై 8 కేసులు నమోదు చేసినట్టు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు తెలిపారు.
అథారిటీకి చెందిన ఇన్స్పెక్షన్ విభాగం అధికారులు షుబ్రా అల్-జలీబ్ ప్రాంతంలోని ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కల్తీ ఆహార పదార్థాలను విక్రయించినందుకు 4 కేసులు, అలాగే మూలం, వివరాలు తెలియని సుమారు 100 కిలోల మాంసాన్ని ధ్వంసం చేసినందుకు మరో 4 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
కువైట్‌లోని వివిధ గవర్నరేట్లలో ఆహార సంస్థలు, ఆహార కార్యకలాపాలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ స్పష్టం చేసింది. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటం, మార్కెట్లలో విక్రయించే ఆహార పదార్థాల భద్రత, నాణ్యతను నిర్ధారించడమే ఈ తనిఖీల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







