బేబీ నక్షత్ర తో మాగల్ఫ్ ముఖాముఖీ
- August 21, 2026
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు.శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది.ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
-నా పేరు నక్షత్ర. మాది కేరళ.నేను ఏడో క్లాస్ చదువుకుంటున్నాను.ఇప్పటి వరకు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కలిపి ఆరు సినిమాలు చేశాను.
‘ఇరుముడి’ అవకాశం ఎలా వచ్చింది?
-దర్శకుడు శివ నిర్వాణ ఇన్‌స్టాగ్రామ్‌లో నా రీల్స్ చూసి ముందుగా మా అమ్మని సంప్రదించారు. ‘ఇరుముడి’ నా తొలి తెలుగు సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది.
‘ఇరుముడి’ అయ్యప్ప స్వామి నేపథ్యంలో ఉన్న కథ కదా? మీది కేరళ. మీరు ఎప్పుడైనా శబరిమల వెళ్లారా?
-కసారి శబరిమల వెళ్లాను.
రవితేజ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-చాలా హ్యాపీగా అనిపించింది.ఆయన నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.ఆయన అంటే నాకు చాలా ఇష్టం.రవితేజ సినిమాల్లో నాకు ‘విక్రమార్కుడు’ చాలా ఇష్టం.
‘ఇరుముడి’లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
-ఇందులో నా పాత్ర పేరు మణికంఠ.నేను రవితేజ కూతురిగా కనిపించబోతున్నాను. ప్రియా మేడమ్ నా తల్లి పాత్రలో నటిస్తున్నారు.రవితేజ, ప్రియా మేడమ్ ఇద్దరూ నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు.ఈ సినిమాకి స్వయంగా డబ్బింగ్ చెప్పాను.
మీరు చిన్న వయసులోనే పృథ్వీరాజ్, శివరాజ్ కుమార్, రవితేజ లాంటి పెద్ద హీరోలతో పనిచేశారు కదా? ఎలా అనిపిస్తుంది?
-చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా మా అమ్మకి థాంక్స్ చెప్తున్నాను. తనే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది.
సినిమాలను, చదువును ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
-ముఖ్యంగా మా టీచర్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా పేరెంట్స్, టీచర్స్ సపోర్ట్‌తోనే నేను సినిమాలు చేయగలుగుతున్నాను.
‘ఇరుముడి’లో మీకు ఇష్టమైన పాట ఏమిటి?
-‘ఇరుముడి’లో పాటలన్నీ నాకు ఇష్టం. కాకపోతే ‘యాలో యాలో’ పాట నా ఫేవరెట్.
శివ నిర్వాణ దర్శకత్వంలో పనిచేయడం ఎలా అనిపించింది?
- శివ నిర్వాణ సపోర్ట్‌తోనే ఈ సినిమాను చాలా కాన్ఫిడెంట్‌గా చేయగలిగాను.
షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి?
సీలేరులో ఈ సినిమాను షూట్ చేశాం. అక్కడి ప్రదేశాలు నాకు కేరళలాగే అనిపించాయి.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది.వారి నిర్మాణంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!
- GTA 6 గేమ్‌పై యూఏఈ హెచ్చరిక..!!







