ఆపిల్ మాక్ యూజర్లకు సైబర్ అలర్ట్..!!
- August 21, 2026
దోహా: ఆపిల్ మాక్ వినియోగదారులకు ఖతార్ జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) కీలక హెచ్చరిక జారీ చేసింది. మాకోస్లోని Screen Sharing ఫీచర్లో ఉన్న హై-రిస్క్ భద్రతా లోపాన్ని సైబర్ నేరగాళ్లు చురుగ్గా దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్కు నేరుగా కనెక్ట్ అయి ఉన్న పరికరాలపై ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు NCSA పేర్కొంది.
ఈ లోపాన్ని ఉపయోగించుకుని దాడి చేసేవారు మాక్‌లో రూట్-లెవల్ యాక్సెస్ పొందుతున్నట్లు వెల్లడించింది. అనంతరం మాల్వేర్ను ఇన్స్టాల్ చేసి, బాధిత పరికరాల కంప్యూటింగ్ వనరులను ఉపయోగించి క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మాకోస్ వినియోగదారులు తమ పరికరాలను తక్షణమే తాజా సెక్యూరిటీ వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలని NCSA సూచించింది. అవసరం లేని సమయంలో Screen Sharing ఫీచర్‌ను డిసేబుల్ చేయాలని కోరింది.
ప్రభావితమయ్యే వెర్షన్లు
* macOS Tahoe: 26.6.1 కంటే ముందు వెర్షన్లు
* macOS Sequoia: 15.7.9 కంటే ముందు వెర్షన్లు
* macOS Sonoma: 14.8.9 కంటే ముందు వెర్షన్లు
మాక్ యూజర్లు తమ సిస్టమ్ వెర్షన్‌ను పరిశీలించి, అందుబాటులో ఉన్న తాజా సెక్యూరిటీ అప్డేట్ను వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







