1,275 ఛానళ్ల మూసివేత..34.29 మిలియన్ల కంటెంట్ తొలగింపు..!!
- August 21, 2026
రియాద్: 2026 తొలి ఆరు నెలల్లో ఆన్‌లైన్‌లో తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న 1,275 ఛానళ్లను మూసివేసి, 34.29 మిలియన్ల తీవ్రవాద కంటెంట్‌ను తొలగించినట్లు గ్లోబల్ సెంటర్ ఫర్ కాంబాటింగ్ ఎక్స్‌ట్రీమిస్ట్ ఐడియాలజీ (Etidal) వెల్లడించింది. డిజిటల్ వేదికల్లో తీవ్రవాద ప్రచారాన్ని అడ్డుకునేందుకు Etidal, Telegram సంస్థలు సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగినట్లు తెలిపాయి.
Etidal, Telegram మధ్య 2022, ఫిబ్రవరిలో సహకారం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు మొత్తం 292.6 మిలియన్ల తీవ్రవాద కంటెంట్‌ను తొలగించినట్లు వెల్లడించింది. ఇదే కాలంలో తీవ్రవాద ప్రచారానికి ఉపయోగించిన 20,360 ఛానళ్లను మూసివేశారు. డిజిటల్ స్పేస్‌లో తీవ్రవాద ప్రచారం, భావజాల వ్యాప్తిని అడ్డుకోవడంలో Etidal, Telegram మధ్య కొనసాగుతున్న సహకారం కీలకంగా మారిందని సంస్థ పేర్కొంది. ఈ సంయుక్త చర్యలు ఆన్‌లైన్‌లో తీవ్రవాద కంటెంట్ వ్యాప్తిని పరిమితం చేయడంతో పాటు మరింత సురక్షితమైన డిజిటల్ వాతావరణం ఏర్పడేందుకు దోహదపడుతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







