కువైట్‌లో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ.. ఫ్లడ్ సమస్యలకు చెక్..!!
- August 21, 2026
కువైట్: భారీ వర్షాల సమయంలో వరదలు, నీటి నిల్వ సమస్యలను తగ్గించేందుకు కువైట్ పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వర్షపు నీటి రిజర్వాయర్లు, రిటెన్షన్ బేసిన్ల వినియోగాన్ని విస్తరిస్తోంది. సమగ్ర డ్రైనేజీ వ్యవస్థలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారీ వర్షాలు కురిసినప్పుడు నివాస ప్రాంతాలు, రహదారుల నుంచి పెద్ద మొత్తంలో ప్రవహించే నీటిని ఈ రిజర్వాయర్లలో తాత్కాలికంగా నిల్వ చేస్తారు. అనంతరం నీటిని సముద్రంలోకి విడుదల చేయడం లేదా ప్రత్యేక డ్రైనేజీ మార్గాల ద్వారా తరలిస్తారు. ముఖ్యంగా సముద్రపు నీటి మట్టం పెరిగే సమయంలో డ్రైనేజీ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది.
మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేస్తున్న వర్షపు నీటి డ్రైనేజీ వ్యవస్థలో డ్రైనేజీ ఛాంబర్లు, మ్యాన్‌హోల్స్, పైప్‌లైన్లు, రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో నీటిని వేగంగా తొలగించేందుకు మొబైల్ పంపులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. భారీ వర్షాల సమయంలో నీరు నిలిచిపోవడం, వరదలు సంభవించే ప్రమాదాన్ని తగ్గించేందుకు ఇవన్నీ కలిసి అదనపు రక్షణ వ్యవస్థగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు.
ఇటీవలి సంవత్సరాల్లో కువైట్‌లో భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో వరదలతో సమస్యలు తలెత్తాయి. దీంతో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు డ్రైనేజీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న నివాస ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థకు వేరుగా వర్షపు నీటి డ్రైనేజీ నెట్‌వర్క్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ నెట్‌వర్క్‌లను శుభ్రం చేయడం, నిర్వహణ పనులు చేపట్టడం, పంపింగ్ పరికరాలను ఆధునీకరించడం వంటి చర్యలను మంత్రిత్వ శాఖ కొనసాగిస్తోంది. అలాగే వర్షాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు సులభంగా అధికారులకు తెలియజేసే విధానాలను మెరుగుపరుస్తున్నారు. ఏడాది పొడవునా భారీ వర్షాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు దేశ సన్నద్ధతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







