గాయపడ్డ పౌరుడికి ఎయిర్ అంబులెన్స్ సేవలు..!!
- August 21, 2026
మస్కట్: ఒమన్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ పౌరుడిని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఎయిర్ వింగ్ అత్యవసర వైద్య తరలింపు ద్వారా హైమా ఆసుపత్రి నుంచి నిజ్వా ఆసుపత్రికి తరలించింది.
రిమా ప్రాంతంలోని సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ స్ట్రీట్‌పై రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురిని అంబులెన్స్ వాహనాల ద్వారా సమీప వైద్య కేంద్రాలకు తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే రాయల్ ఒమన్ పోలీస్ అత్యవసర స్పందన చర్యల్లో భాగంగా ఎయిర్ వింగ్ సేవలను వినియోగించింది. గాయపడిన వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







