బీజేపీ కొత్త టీమ్ తో ప్రధాని మోదీ..!

- August 22, 2026 , by Maagulf
బీజేపీ కొత్త టీమ్ తో ప్రధాని మోదీ..!

న్యూ ఢిల్లీ:  భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన కొత్త నాయకత్వంతో పాటు, ఇటీవల నూతనంగా ఎన్నికైన జాతీయ కార్యవర్గ సభ్యులు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. నూతనంగా ఏర్పాటైన జాతీయ (PM Modi) కార్యవర్గంతో ప్రధాని మోదీ జరిపిన ఈ తొలి ఉన్నత స్థాయి సమావేశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రధాని మోదీ నూతన టీమ్‌కు దిశానిర్దేశం చేశారు.

పదవులు కేవలం బాధ్యతలకే పరిమితం కాకుండా :
ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత పదవులు కేవలం బాధ్యతలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలతో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఒక వేదికగా ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తూ, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.

ఇదే సమావేశంలో జాతీయ స్థాయిలో ‘వందేభారత్’ గీతం మరియు దాని చారిత్రక ప్రాముఖ్యతను కాపాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఒక ముఖ్యమైన తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఇటీవల ప్రకటించిన ఈ నూతన జాతీయ కార్యవర్గ కూర్పులో యువతకు, మహిళలకు మరియు అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులకు సమతూకంతో కూడిన ప్రాతినిధ్యం కల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com