బహ్రెయిన్‌లో 17 వేల కుటుంబాలకు హౌసింగ్ ఫైనాన్స్ ప్రయోజనం..!!
- August 23, 2026
మనామా: 2022 ఆగస్టు నుంచి ఇప్పటివరకు సుమారు 17,000 బహ్రెయిన్ కుటుంబాలు హౌసింగ్ ఫైనాన్స్ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందినట్లు హౌసింగ్, అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వశాఖ హౌసింగ్ ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ ఇమాన్ అల్ అబ్బాసి తెలిపారు. భాగస్వామ్య బ్యాంకులతో కుదిరిన ఒప్పందాల ద్వారా పౌరులకు గృహ ఎంపికల్లో మరింత వెసులుబాటు లభించిందన్నారు. లబ్ధిదారులు తమ అవసరాలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వివిధ పథకాలను ఎంచుకోవచ్చని తెలిపారు. సంబంధిత పథకాన్ని బట్టి నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయడం లేదా స్థలం కొనుగోలు చేయడం వంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు.
పౌరులు తమ ప్రాధాన్యతలకు సరిపోయే గృహ పరిష్కారాలను త్వరగా పొందడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు. హౌసింగ్ మంత్రిత్వశాఖ, బహ్రెయిన్ హౌసింగ్ బ్యాంక్, భాగస్వామ్య బ్యాంకుల మధ్య సహకారం ద్వారా మరిన్ని గృహ, ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులోకి వస్తున్నాయని అల్ అబ్బాసి పేర్కొన్నారు. బ్యాంకుల ఆఫర్లను పోల్చుకునేలా, పౌరులకు మరింత సౌలభ్యం కల్పించేలా ఈ కార్యక్రమాలను నిరంతరం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
మొబైల్ హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్
పౌరులకు గృహ, ఆర్థిక సేవలను మరింత చేరువ చేసేందుకు మంత్రిత్వశాఖ, బహ్రెయిన్ హౌసింగ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మొబైల్ హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్’ 10వ ఎడిషన్ గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో ‘తస్హీల్’ ఫైనాన్స్ పథకాలు, ‘తస్హీల్’, ‘తమూహ్’ వంటి వివిధ గృహ ఫైనాన్స్ కార్యక్రమాలపై ప్రజలు సమాచారం పొందవచ్చు. అలాగే బీయిట్ వై (BeitY) ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా బహ్రెయిన్ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న విల్లాలు, అపార్ట్మెంట్లు, స్థలాలను ఒకే వేదికపై పరిశీలించే అవకాశం ఉందని అల్ అబ్బాసి తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







