సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్‌లో బోర్డింగ్ పాస్‌పై స్టాంపింగ్ రద్దు..!!
- August 23, 2026
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే ఉద్దేశంతో భారత విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సమయంలో బోర్డింగ్ పాస్‌పై ఫిజికల్ స్టాంపింగ్‌ను సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేయనున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BoI) విమానాశ్రయ అధికారులకు తెలియజేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న బోర్డింగ్ పాస్ స్టాంపింగ్ విధానం ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతోందన్న నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఎలక్ట్రానిక్, ప్రింటెడ్ బోర్డింగ్ పాస్‌లు రెండూ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో చెల్లుబాటు అవుతాయి. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ఈ-బోర్డింగ్ పాస్‌ను చూపించి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చు. ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ ఉన్నవారికీ అదే విధానం కొనసాగుతుంది. బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ వేయాల్సిన అవసరం లేకపోవడంతో విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







