‘టాక్సిక్’ పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది: హీరో యశ్
- August 23, 2026
రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో రిలీజ్ కానుంది. ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ‘కేజీఎఫ్’ తర్వాత మీకు థాంక్స్ చెప్పడానికి కూడా నేను ఇక్కడికి రాలేదు. పనిలో నిమగ్నమైపోయాను. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజాయితీ, సంకల్పంతో పని చేస్తే ప్రేక్షకులు ఎవరినైనా సపోర్ట్ చేస్తారని మీరు నిరూపించారు. సినిమాకు సరిహద్దులు లేవు. భాషను, సరిహద్దులను మించి మానవత్వం ఉంది, ప్రేమ ఉంది, నిజాయితీ ఉంది అని మీరు చూపించారు. అలాగే కర్ణాటకలో కూడా మేము తెలుగు ప్రజలను సినిమాలని ఎంతగానో ఇష్టపడతాం. మన ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయిలో నిలబడాలి. మనందరం కలిసి ఇండియన్ సినిమాను గ్లోబల్ సినిమాలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలి. మీరందరూ యువత. మీరు అనుకున్నది మనసులో బలంగా సంకల్పించుకుని ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాలను సాధిస్తారు. ముందుగా మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. మీపై నమ్మకంతో పనిచేయండి. ఇతరుల మాటలను పట్టించుకోకండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది.
‘టాక్సిక్’ సినిమా గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాకు ఇండియా నుంచి బెస్ట్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పనిచేశారు. ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా ఎఫర్ట్ పెట్టారు. మీరందరూ ఇండియన్ సినిమా కోసం కలిసికట్టుగా రావాలని కోరుతున్నాను. మన ఇండియన్ సినిమా గురించి మనం గర్వపడేలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ‘కేజీఎఫ్’కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఆహర్నిశలు ఈ సినిమా కోసం పనిచేశారు. ‘కేజీఎఫ్ 2’ సమయంలో దిల్ రాజు గారితో మాకు పరిచయం ఏర్పడింది. ఆయన చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. నిజంగా ఆయనకు చాలా మంచి దిల్ ఉంది. ఆయనతో కలిసి ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా ఆడియన్స్‌కు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం.
కేవీఎన్ గారు ఇండస్ట్రీకి డబ్బు సంపాదించడానికి రాలేదు. ఫిలిం ఇండస్ట్రీకి తన వంతు సహకారం అందించాలని వచ్చారు. బెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌గా మైల్స్టోన్ సినిమాలను నిర్మిస్తున్నారు. హుమా ఖురేషి ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించారు. కియారాతో మరోసారి ఆడియన్స్ ప్రేమలో పడిపోతారు. రుక్మిణి వసంత్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. తను ప్రతి ఇండస్ట్రీలోనూ అద్భుతమైన సినిమాలు చేస్తోంది. లేడీ సూపర్‌స్టార్ నయనతార గారు ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. ‘టాక్సిక్’ పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను. ఇంతకంటే అద్భుతమైన సినిమాలు చేస్తాను. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ: ఈ సినిమాను చాలా పెద్ద విజన్‌తో, బోల్డ్ డ్రీమ్‌తో, చాలా బ్యూటిఫుల్‌గా నిర్మించాం. మేము ఎంత జాగ్రత్త తీసుకున్నామో ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపించి ఉంటుంది. ‘టాక్సిక్’ సినిమా ప్రేక్షకులకు చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఒక గ్రేట్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ సినిమాను చూసే ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన అనుభూతి కలుగుతుంది. యశ్ ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలని నిరంతరం ప్రయత్నిస్తున్నారు. దర్శకురాలు గీతు గారు ప్రతి సన్నివేశంలో ఎమోషన్‌ను అద్భుతంగా పండించారు. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ కుమార్ తదితరులు అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. విశాల్ మిశ్రా, రవి బస్రూర్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దిల్ రాజు గారితో కొలాబరేషన్ ప్రతి సినిమాకీ ఒక బలం తీసుకొస్తుంది. మా సినిమా ప్రేక్షకులకు రీచ్ కావడానికి దిల్ రాజు ద్వారా మాకు పర్ఫెక్ట్ ఛానల్ దొరికింది. సినిమాకు ఏం కావాలో వాళ్లు అన్నీ సమకూరుస్తున్నారు. ఈ వేడుక నిర్వహణకు మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జనవరి 26న థియేటర్స్‌లో కలుద్దాం. ‘టాక్సిక్’ మిమ్మల్ని ఎంగేజ్ చేయడమే కాదు, ఎక్సైట్ చేయడమే కాదు.. మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
కియారా అద్వానీ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మహేశ్ బాబు గారితో కలిసి ‘భరత్ అనే నేను’ నా తొలి తెలుగు సినిమా.అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం, ప్రేమను మాటల్లో చెప్పలేను.ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది. ‘టాక్సిక్’ తెలుగు సినిమా మాత్రమే కాదు.. ఇది ఇండియన్ సినిమా. యశ్ కి, ఈ సినిమా టీమ్‌కి థాంక్యూ. జనవరి 26న ఫస్ట్ డే ఫస్ట్ షోకి థియేటర్స్‌లో కలుద్దాం. అందరికీ లవ్ యు.
మల్లారెడ్డి మాట్లాడుతూ: హీరో యశ్ మా యూనివర్సిటీకి రావడం చాలా ఆనందంగా ఉంది. ‘టాక్సిక్’ సినిమా మా గ్రౌండ్స్‌లో ఈవెంట్ జరుపుకోవడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. నిర్మాత వెంకట్ కి ధన్యవాదాలు.మా దిల్ రాజు పెద్ద మనసున్న నిర్మాత. ‘యానిమల్’ సినిమాకు రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను చెప్పాను. ఆ సినిమా నిజంగానే రూ.1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమా రూ.2100 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెబుతున్నాను. కచ్చితంగా ఈ సినిమా అంత కలెక్షన్ సాధిస్తుంది.
హుమా ఖురేషి మాట్లాడుతూ: మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ముందుగా మా దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌కు థాంక్స్. ఇంత అద్భుతమైన సినిమాలో నన్ను భాగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నయనతార, రుక్మిణి వసంత్ వంటి వారితో కలిసి నటించడం చాలా మంచి అనుభవం.యశ్ తో కలిసి పనిచేయడం కూడా ఎంతో గొప్ప అనుభూతి. గీతు ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది.
రుక్మిణి వసంత్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది.యశ్ తో కలసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కియారా, నయనతార తో పాటు అందరితో కలిసి ఈ సినిమా చేయడం ఎంతో ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ, అభిమానం లభిస్తుందని ఆశిస్తున్నాను. తప్పకుండా సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఈరోజు దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ కేవీఎన్. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. రామానాయుడు తర్వాత ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు అభినందనలు. ‘కేజీఎఫ్’ సినిమాతో యశ్ తో నాకు పరిచయం అయింది. ‘కేజీఎఫ్’ తర్వాత ఎవరైనా ఇంకా పెద్దగా ఆలోచిస్తారు. కానీ యశ్ మాత్రం ఒక కొత్త దర్శకురాలిని పరిచయం చేస్తూ, కథలో ఉన్న బలాన్ని నమ్మి ‘టాక్సిక్’ సినిమా చేశారు. ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా మార్చాలనే ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్. రాజమౌళి తర్వాత ఇలాంటి ఫిల్మ్మేకర్లు ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజన్, నమ్మకం ఉంటేనే ఇలాంటి సినిమా సాధ్యమవుతుంది. ఈ సినిమా విజువల్స్ చూస్తే మతి పోయింది. నిర్మాతలు ఎంత చెబితే అంత ఇచ్చి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. కంపోజర్ విశాల్ మిశ్రా ఈ సినిమా రూ.2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. అది ఈ యూనిట్ మొత్తానికి ఈ సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. యశ్ గారితో సినిమా చేయడానికి నేను కూడా వెయిటింగ్. ఆయన అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తుంటాను.
మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మాట్లాడుతూ.. నా జీవితంలో ఏడు నెలలు ఈ సినిమా కోసం కంటిన్యూగా కేటాయించాను. ‘కేజీఎఫ్’ తర్వాత అంతే అంకితభావంతో ఈ సినిమాకు పనిచేశాను. చాలా మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా చూస్తే ఆటోమేటిక్‌గా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది.యశ్, కేవీఎన్ చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను నిర్మించారు. జనవరి 26న థియేటర్లలో ఒక మ్యాడ్నెస్ చూస్తారు.
లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..ఈ సినిమాలో సింగిల్ కార్డు రాయడం ఆనందాన్ని ఇచ్చింది.యశ్, కేవీఎన్ అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఖచ్చితంగా ఈ సినిమా ఒక సంచలన విజయాన్ని సాధించబోతుంది. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్‌కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్‌లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్‌లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







