ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- August 25, 2026
పారిస్: ఫ్రాన్స్‌లో భారీ థీమ్ పార్క్ ప్రాజెక్ట్‌కు తెరలేవనుంది. సౌదీ అరేబియాకు చెందిన ఖిద్దియా( Qiddiya) మద్దతుతో పారిస్ లో మూడు థీమ్ పార్కులను అభివృద్ధి చేయడానికి 6 బిలియన్ యూరోల పెట్టుబడి పెట్టనున్నట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు. ఫ్రాన్స్‌లో డిస్నీల్యాండ్ పారిస్ తర్వాత ఇంత భారీ స్థాయిలో చేపడుతున్న ఎంటర్ టైన్ మెంట్ ప్రాజెక్ట్ ఇదేనని మాక్రాన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 22,000 ఉద్యోగాలు ఏర్పడతాయని మాక్రాన్ తెలిపారు. ఫ్రాన్స్‌ను ప్రపంచ ఎంటర్ టైన్మెంట్ గమ్యస్థానంగా మార్చడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ మూడు థీమ్ పార్కుల్లో ప్రముఖ జపనీస్ మాంగా, అనిమే ఫ్రాంచైజీ ‘డ్రాగన్ బాల్’ స్ఫూర్తితో ప్రత్యేకంగా ఓ భారీ థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు.
సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు. దీంతో రియాద్–పారిస్ మధ్య ఆర్థిక, పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. మాక్రాన్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఛూస్ ఫ్రాన్స్ (Choose France)’ కార్యక్రమంలో భాగంగానే ఈ పెట్టుబడిని ఆయన ప్రస్తావించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, భారీ ప్రాజెక్టులను ఫ్రాన్స్‌కు తీసుకురావడం, ఉద్యోగాలను సృష్టించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) పోర్ట్‌ఫోలియో సంస్థ అయిన ఖిద్దియా.. వినోదం, క్రీడలు, సంస్కృతి రంగాల్లో సౌదీ అరేబియా భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో విస్తరిస్తోంది. రియాద్ సమీపంలోని ఖిద్దియా సిటీలో సిక్స్ ఫ్లాగ్స్ ఖిద్దియా సిటీ, అక్వారేబియా, గేమింగ్-ఈస్పోర్ట్స్ జిల్లా, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ స్టేడియం వంటి భారీ ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







