మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- August 25, 2026
మనామా: ఇద్దరు మహిళల మానవ అక్రమ రవాణా కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను బహ్రెయిన్‌లోని ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఆగస్టు 30కి వాయిదా వేసింది.
కేసు పత్రాల ప్రకారం.. నిందితులు ఓ క్రిమినల్ ముఠాగా ఏర్పడి ఇద్దరు మహిళలను అక్రమంగా తరలించి, వారి స్వేచ్ఛను పరిమితం చేసి, ఆర్థిక లాభం కోసం వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మహిళల్లో ఒకరిని ఫ్యాషన్ మోడల్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి బహ్రెయిన్‌కు రప్పించినట్లు, మరో మహిళకు సెలూన్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పినట్లు కేసు పత్రాల్లో పేర్కొన్నారు. అయితే బహ్రెయిన్‌కు వచ్చిన తర్వాత తమను వ్యభిచారంలోకి నెట్టేందుకు తీసుకొచ్చినట్లు ఇద్దరికీ తెలిసిందని ఆరోపణలు ఉన్నాయి.
నిందితులు మహిళలను బెదిరించడంతో పాటు వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిలో ఒకరు చివరకు కుటుంబ సభ్యులను, ఓ బహ్రెయిన్ వ్యక్తిని సంప్రదించగా, అతని సహాయంతో హాస్టల్ నుంచి బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కోర్టు పత్రాలు వెల్లడించాయి.
ఈ కేసులోని ఇతర నిందితులకు ఒకటి నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించగా, నిందితులందరినీ శిక్షలు పూర్తయిన అనంతరం బహ్రెయిన్ నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!







