200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- August 25, 2026
కువైట్ : కువైట్‌లోని సిక్త్ రింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన ఓ కువైట్ పౌరుడిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించారు. అంత వేగంగా వాహనం నడపడం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు.
భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. మొబైల్ రాడార్ ద్వారా వాహనం అధిక వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో ట్రాఫిక్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి వాహనాన్ని అడ్డుకున్నారు. పట్టుబడిన లగ్జరీ కారు విలువ KD100,000 (కువైట్ దినార్లు)కు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.
డ్రైవర్‌కు ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోగ్రాఫిక్ ఆధారాలను చూపించారు. అనంతరం ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ ఆదేశాలతో చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వాహనాన్ని రెండు నెలల పాటు సీజ్ చేయడంతో పాటు కేసును ట్రాఫిక్ కోర్టుకు అప్పగించారు.
ప్రవాసులు ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే వాహనం సీజ్ చేయడంతో పాటు దేశం నుంచి బహిష్కరణ, జరిమానా వంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







