సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- August 25, 2026
జెడ్డా: సౌదీ అరేబియాలో మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని పేర్కొంది.
NCM వర్ష సూచన ప్రకారం.. జజాన్, అసీర్, అల్-బహా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, పిడుగులు, వడగళ్లతో పాటు బలమైన గాలులతో కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావం మక్కా, మదీనా ప్రాంతాల్లోని ఎత్తైన ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చని తెలిపింది.
తూర్పు ప్రావిన్స్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, మధ్య, దక్షిణ ప్రాంతాలతో పాటు నజ్రాన్లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలుల కారణంగా దుమ్ము, ధూళి ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
సౌదీలోని పలు ప్రాంతాల్లో ఒకవైపు తీవ్ర వేడి, మరోవైపు ఉరుములు, పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







