సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- August 27, 2026
రియాద్: సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి, క్యాబినెట్ సభ్యుడు, వాతావరణ దూత అదెల్ అల్-జుబైర్ బుధవారం భారత, బ్రెజిల్ దేశాల రాయబారులతో సమావేశమయ్యారు. రియాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సౌదీ అరేబియాలో నూతనంగా నియమితులైన భారత రాయబారి విపుల్‌తో అల్-జుబైర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారత రాయబారికి స్వాగతం పలికి, కొత్త బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
అలాగే, సౌదీ అరేబియాలో బ్రెజిల్ రాయబారి పాలో ఉచోవా రిబెయిరో ఫిల్హోతో కూడా అల్-జుబైర్ సమావేశమయ్యారు. ఇరువురు పరస్పర ఆసక్తికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. భారత్, బ్రెజిల్‌తో సౌదీ అరేబియా ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై ఈ భేటీలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







