రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- August 27, 2026
రియాద్: మహిళను లైంగికంగా వేధించడంతో పాటు మరో వ్యక్తిపై దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని రియాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రియాద్ పోలీసుల ప్రకారం, ప్రాథమిక దర్యాప్తులో నిందితుడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అతనిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, దక్షిణ జజాన్ ప్రాంతంలోని ఓ మసాజ్ సెంటర్‌లో ప్రజా మర్యాదలకు విరుద్ధమైన చర్యలకు పాల్పడిన ఇద్దరు ప్రవాసులను అధికారులు అరెస్ట్ చేశారు.జజాన్ పోలీసులు, జనరల్ డైరెక్టరేట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ అండ్ కాంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సమన్వయంతో నిర్వహించిన సంయుక్త భద్రతా ఆపరేషన్‌లో ఈ అరెస్టులు జరిగాయి.
అవసరమైన చట్టపరమైన చర్యలు పూర్తిచేసిన అనంతరం నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు పబ్లిక్ సెక్యూరిటీ తెలిపింది.అలాగే నిబంధనలు ఉల్లంఘించిన మసాజ్ సెంటర్‌పై మున్సిపల్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు, ఇతర శిక్షా చర్యలు విధించే ప్రక్రియను పూర్తి చేసినట్లు జజాన్ మున్సిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







