పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- August 27, 2026
దోహా: విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘బ్యాక్ టు స్కూల్’ ప్రచారాన్ని ప్రారంభించనుంది. “Healthy Bodies Build Strong Nations” అనే నినాదంతో ఈ ప్రచారం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఖతార్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కిండర్గార్టెన్లలో నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడంతో పాటు, ఆరోగ్యం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కీలకమైన అంశమనే అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా PHCC తెలిపింది.
ఈ ప్రచారంలో తగినంత నిద్ర, ఎలక్ట్రానిక్ పరికరాల అధిక వినియోగాన్ని తగ్గించడం, ఎక్కువగా నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం, స్వీయ నియంత్రణ, వ్యక్తిగత బాధ్యత, మానసిక-భావోద్వేగ ఆరోగ్యం, పాఠశాలలో సానుకూల సామాజిక ప్రవర్తన వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులు తమ రోజువారీ ఆరోగ్య అలవాట్లను స్వయంగా పరిశీలించుకునేలా వారపు ట్రాకింగ్ కార్డులు, సెల్ఫ్-అసెస్మెంట్ టూల్స్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల నర్సింగ్ సిబ్బంది కూడా భాగస్వాములు కానున్నారు. పాఠశాలలో, ఇంట్లో ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించేందుకు వీరి సహకారం కీలకమని PHCC స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అండ్ సర్వీసెస్ మేనేజర్, కమ్యూనిటీ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ లైలా అబ్దుల్లా అల్ దహ్నైమ్ తెలిపారు. ఆరోగ్యంపై అవగాహన కలిగిన, ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన జీవనశైలిని అనుసరించే తరాన్ని తీర్చిదిద్దడంలో ఈ ప్రచారం కీలకమైన అడుగు అని తెలిపారు.
ప్రచారంలో భాగంగా వివిధ వయసుల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, తరగతి గది మరియు పాఠ్యేతర కార్యకలాపాలు, వర్క్‌షాప్‌లు, ఆరోగ్య విద్యా సెషన్లు, తల్లిదండ్రుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై తమ అవగాహనను సృజనాత్మకంగా ప్రదర్శించేలా విద్యార్థులను ప్రోత్సహించడం ఈ పోటీ ఉద్దేశమన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







