రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- August 28, 2026
హైదరాబాద్: మల్కాజ్గిరి కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కంబాల శంకర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కేవలం 31 ఏళ్ల వయసులోనే ఆయన అకాల మరణం చెందడం కుటుంబ సభ్యులతో పాటు పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.
శంకర్ కుటుంబ సభ్యులకు రూ.95 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును డీజీపీ సి.వి. ఆనంద్ అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శంకర్ కుటుంబానికి అందాల్సిన ఆర్థిక సహాయం, ఇతర ప్రయోజనాల ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసిన పోలీస్ వెల్ఫేర్ విభాగం, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులను డీజీపీ అభినందించారు.
శంకర్ మృతి ఆయన కుటుంబానికే కాకుండా మొత్తం పోలీసు శాఖకు తీరని లోటని డీజీపీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది ఎదుర్కొనే అనుకోని పరిస్థితుల్లో వారి కుటుంబాలకు అండగా నిలవడం శాఖ బాధ్యత అని తెలిపారు.
శంకర్ కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ తరఫున అందాల్సిన సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులకు అవసరమైన ఆర్థిక, ఇతర ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!







