స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- August 28, 2026
దుబాయ్: యూఏఈ వ్యాప్తంగా 10 లక్షలకు పైగా విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, విద్యార్థుల ప్రయాణం సురక్షితంగా ఉండేలా దుబాయ్ ట్యాక్సీ కంపెనీ (DTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంస్థకు చెందిన 1,215 స్కూల్ బస్సులను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. వీటి ద్వారా దుబాయ్, అజ్మాన్, రస్ అల్ ఖైమాలో ప్రతిరోజూ సుమారు 36,500 మంది విద్యార్థులు ప్రయాణించనున్నారు. స్కూళ్లు ప్రారంభం కాకముందే ప్రతి బస్సుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్సుల యాంత్రిక పరిస్థితి, పరిశుభ్రత, భద్రతా పరికరాలు, రోజువారీ విద్యార్థుల రవాణాకు అనుకూలత వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.
విద్యార్థులు తిరిగి స్కూళ్లకు వచ్చే సమయానికి బస్సులు, డ్రైవర్లు, సహాయక వ్యవస్థలు పూర్తిగా సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని DTC అసెట్ డైరెక్టర్ నాసర్ అల్ హాజ్ తెలిపారు. ప్రతి బస్సు యాంత్రికంగా, నిర్వహణ పరంగా సక్రమంగా ఉందో లేదో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని తనిఖీలు పూర్తై, ప్రతి వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నట్లు నిర్ధారించిన తర్వాతే విద్యార్థుల రవాణాకు బస్సును అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ప్రతి బస్సుపై నిఘా
స్కూల్ బస్సుల నిర్వహణలో సాంకేతికతకు DTC ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి స్కూల్ ప్రయాణాన్ని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (OCC) నుంచి రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ సెంటర్లోని భారీ స్క్రీన్లపై ప్రతి బస్సు ప్రస్తుత లొకేషన్, బస్సులోని లైవ్ వీడియో, ట్రాఫిక్ పరిస్థితులు, వాహన వేగం తదితర వివరాలను అధికారులు గమనిస్తారు. ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా బస్సు మార్గాలను కూడా సర్దుబాటు చేస్తున్నారు. ఏదైనా రోజు ఒక విద్యార్థి గైర్హాజరైతే, ఆ విద్యార్థి స్టాప్‌ను తొలగించి బస్సు రూట్‌ను మరింత చిన్నదిగా మార్చే అవకాశం ఉందని నాసర్ తెలిపారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్
తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయాణించే స్కూల్ బస్సులను ట్రాక్ చేసేందుకు DTC స్కూల్ బస్ యాప్ ను ఉపయోగించుకోవచ్చు. యాప్‌లో బస్సు లైవ్ GPS లొకేషన్, బస్సు ప్రయాణించిన మార్గం, విద్యార్థి సురక్షితంగా చేరుకున్నట్లు తక్షణ సమాచారం, ట్రాఫిక్ సమస్యలపై అలర్ట్స్, విద్యార్థి గైర్హాజరు సమాచారాన్ని నమోదు చేసే సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన నిఘా వ్యవస్థల ద్వారా బస్సులో ఏ విద్యార్థి కూడా మిగిలిపోకుండా పర్యవేక్షిస్తున్నారు. బస్సులు, విద్యార్థుల కదలికలను ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ పరికరాల ద్వారా కూడా గమనిస్తున్నారు.
డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ
స్కూల్ బస్సు డ్రైవర్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. సురక్షిత డ్రైవింగ్, విద్యార్థుల పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, పిల్లలను రవాణా చేసే సమయంలో డ్రైవర్లు, అటెండెంట్ల బాధ్యతలు వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులను సాధారణంగా ఇంటి వద్ద దింపడం నుంచి అనుకోని అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే వరకు ప్రతి అంశంలో డ్రైవర్లు, అటెండెంట్లు సిద్ధంగా ఉండేలా శిక్షణ ఇస్తున్నట్లు DTC తెలిపింది. విద్యార్థుల భద్రత, సంక్షేమమే స్కూల్ బస్సు సేవల్లో ప్రధాన ప్రాధాన్యంగా కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు







