‘కూర్మ అవతార్’ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను: హీరో శివ రాజ్ కుమార్
- August 31, 2026
‘కూర్మ అవతార్’ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా గొప్ప విజన్ తో తీసిన సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్
కూర్మ అవతార్ టీజర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ నిర్మాత దిల్ రాజు
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో హర్ష వర్ధన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కూర్మ అవతార్'. నరేంద్ర కొండ సమర్పణలో పంచవక్త్ర పిక్చర్స్ & రుక్వీణ స్టూడియోస్ బ్యానర్స్ పై పూజిత, సేవిత నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సాయి కుమార్, శివాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ హర్ష సర్ప్రైజ్ చేశాడు. ఈ సినిమా ‘నరసింహ అవతార్’, ‘ఇరుముడి’ సినిమాల్లాగే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. అలాగే రాజ్ తరుణ్ గారు, వరలక్ష్మి శరత్‌కుమార్ గారు, టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సాయికుమార్ గారు ‘ఇరుముడి’ సినిమాలో మొన్ననే గురుస్వామిగా ఈ రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు. ఆ సినిమా మా అందరిలో చాలా గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు అలా తండోపతండాలుగా థియేటర్స్‌కి వస్తుంటే మా అందరికీ ధైర్యం వస్తుంది. ‘ఇరుముడి’ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక మంచి ఎనర్జీ ఇచ్చింది. శివ రాజ్‌కుమార్ గారు ఒక సూపర్‌స్టార్. మొన్ననే పెద్దితో సర్ప్రైజ్ చేశారు. మొన్న ఒక కథ విన్నప్పుడు, ‘ఆ కథ కోసం శివ రాజ్‌కుమార్ గారి దగ్గరికి వెళ్ళండి’ అని మా టీమ్‌కి చెప్పాను. తొందరలోనే వాళ్లు అప్రోచ్ అవుతారు. ఈ టీజర్‌లాగే రెండు గంటల సినిమా కూడా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘కూర్మావతార్’ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను బాలయ్య గారి ‘శాతకర్ణి’ సినిమాలో చేశాను. రీసెంట్గా రామ్ చరణ్ గారి ‘పెద్ది’ సినిమాలో చేశాను. ఇప్పుడు ‘కూర్మావతార్’ సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. నేను ఎప్పుడూ కొత్త దర్శకుడు, పాత దర్శకుడు అని చూడను. కథ నచ్చితే సినిమా చేస్తాను. దర్శకుడిని నమ్ముతాను. హర్ష అద్భుతమైన విజన్‌తో ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో సాయికుమార్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మేము ఇప్పటివరకు ఎన్నో సినిమాలు కలిసి చేశాం. వరలక్ష్మి శరత్ కుమార్ చాలా అద్భుతమైన పెర్ఫార్మర్. తను దర్శకత్వం కూడా చేసింది. ఆ సినిమా నేను చూశాను. నాకు చాలా నచ్చింది. ఇందులో కూడా తను చాలా మంచి వర్క్ చేశారు. ప్రేక్షకుల అభిమానులు, ప్రశంసలే మాకు గొప్ప ఎనర్జీ ఇస్తాయి. మరిన్ని మంచి సినిమాలు చేయాలని ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మన నిర్మాతలు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా శివరాజ్ కుమార్ గారితో ఈ సినిమా చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేమందరం చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశాం. మా డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
సాయికుమార్ మాట్లాడుతూ.. శివన్న ఈ సినిమా చేయడం దైవ సంకల్పం. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా మంచి టీమ్‌తో కలిసి సినిమా చేస్తున్నాం. ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్. హర్ష కథ చెప్పగానే చాలా నచ్చింది. కూర్మావతారం అనగానే నాకు శ్రీకాకుళం గుర్తొచ్చింది. ఎందుకంటే నేను శ్రీకాకుళం అల్లుడిని. ఆయన ఇందులో చాలా మంచి వేషం చేశారు. శివన్నతో కలిసి నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా అమ్మగారు డాక్టర్ రాజ్‌కుమార్ గారితో కన్నడలో నటించారు. మా నాన్నగారు రాజ్‌కుమార్ గారికి తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు. నిజానికి నాకు హీరోని చేసింది కర్ణాటక. పోలీస్ స్టోరీ’ సినిమా లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. మా అందరికీ కూడా కర్ణాటక బ్రేక్ ఇచ్చింది. శివరాజ్ కుమార్ గారి ఫ్యామిలీతో నాకు ఎంతో గొప్ప అనుబంధం ఉంది. చాలా మంచి మనసున్న మనుషులు. శివన్న, నేను కలిసి చాలా మంచి సినిమాలు చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరికీ శ్రీకూర్ముడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ అద్భుతంగా ఉంది. హర్ష అద్భుతంగా తీశారు. ఇందులో ఇప్పటివరకు నేను చేయని ఒక క్యారెక్టర్ చేశాను. శివన్న గారు ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన రావడంతో సినిమా మరో స్థాయికి వెళ్లింది. అజనీష్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అందరికీ మా అందరిపై ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం. టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డైరెక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా పెద్ద జర్నీ. మా రాజ్ తరుణ్, శివన్న గారు, సాయికుమార్ గారు.. ఇలా అందరూ దేవుళ్లలా నాకు తోడుగా నిలిచారు. వాళ్ల సపోర్ట్ నేను మర్చిపోలేను. ముఖ్యంగా శివరాజ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను తొలి సినిమా చేస్తున్న దర్శకుడిని. కథ చెప్పగానే ఆ పాత్రను అంగీకరించిన ఆయనకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్.
నిర్మాత నరేంద్ర మాట్లాడుతూ.. నా తొలి సినిమా ఇది. నాకు సినిమాలంటే చాలా పిచ్చి. విష్ణుమూర్తికి సంబంధించిన రెండో అవతారం కథతో ఈ సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. శివన్న గారు, సాయికుమార్ గారు, వరలక్ష్మి గారు.. వీళ్లందరూ అద్భుతమైన వెటరన్ యాక్టర్స్. నా తొలి సినిమాలోనే వాళ్లతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మా టీమ్ అందరూ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మా డైరెక్టర్ గారు ఎంతో గొప్ప విజన్‌తో ఈ సినిమా తీశారు. సినిమాకు మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను.
నిర్మాత పూజిత మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శివన్నకి చాలా థాంక్స్. అలాగే వరలక్ష్మి గారికి, సాయికుమార్ గారికి, రాజ్ తరుణ్ గారికి, మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. మేము ఎంత కష్టపడ్డామో అదంతా మీకు సినిమాలో కనిపిస్తుంది. మా టీజర్‌ను సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్.
అజనీష్ లోక్‌నాథ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘కూర్మావతార్’లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. కూర్మావతారం కథను దర్శకుడు చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. ఇలాంటి సినిమాకు తప్పకుండా మ్యూజిక్ చేయాలని అనిపించింది. ఇందులో కాలభైరవ క్యారెక్టర్‌ను శివన్న గారు చేస్తున్నారని తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను ‘కాంతారా’లో వరాహ అవతారంపై ఒక పాట చేశాను. దానికి చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ‘కూర్మావతార్’ సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
నటీనటులు: శివ రాజ్ కుమార్ , వరలక్ష్మి శరత్‌కుమార్, సాయి కుమార్, శివాజీ, రాజ్ తరుణ్, అతిరా రాజ్, రాజా రవీంద్ర, లౌక్య సాయి, సప్తగిరి, తాగుబోతు రమేష్, శత్రు, వీటీవీ గణేష్, గెటప్ శ్రీను, మహేష్ విట్టా తదితరులు
ప్రజెంట్స్ - నరేంద్ర కొండ
బ్యానర్ - పంచవక్త్ర పిక్చర్స్ & రుక్వీణ స్టూడియోస్
రచన & దర్శకత్వం - హర్ష వర్ధన్ కడియాల
నిర్మాతలు - పూజిత కె. కె. సేవిత
సహ నిర్మాత - పి. స్నిగ్ధ రెడ్డి
సినిమాటోగ్రఫీ - జగదీష్ చీకటి
సంగీతం - బి. అజనీష్ లోకనాథ్
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్ - రాఘవేంద్ర నగరడోన
అడిషినల్ స్క్రీన్ ప్లే & డైలాగ్స్ - లేఖక్ రామ్
పబ్లిసిటీ డిజైనర్స్ - కన్ని స్టూడియోస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అనిల్ కుమార్ మైలాపూర్
లైన్ ప్రొడ్యూసర్ - కాసా కిరణ్
ప్రొడక్షన్ కంట్రోలర్ - బల్ధురి చంద్ర శేఖర్
డిజిటల్ మీడియా - జంపని మనోజ్
PRO - వంశీ శేఖర్
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







