గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..

- September 01, 2026 , by Maagulf
గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..

హైదరాబాద్: హైదరాబాద్‌ను భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ మరియు అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ఇటీవల సీఎం విదేశీ పర్యటనల్లో సాధించిన పురోగతికి సంబంధించిన నివేదికను సోమవారం ఒక ఉన్నతస్థాయి కమిటీ ముఖ్యమంత్రికి సమర్పించింది. యూకే, అమెరికా దేశాల్లో నిర్వహించిన పర్యటనల ద్వారా ప్రపంచ స్థాయి విద్యాసంస్థలతో కీలకమైన ఒప్పందాలు కుదిరినట్లు ఈ సమావేశంలో కమిటీ వెల్లడించింది.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటు

అమెరికాకు చెందిన ప్రముఖ ‘నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ’ అలాగే యూకేలోని ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’ సంస్థలు భారతదేశంలో తమ తొలి అధికారిక ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. ముఖ్యంగా నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ తమ క్యాంపస్‌ను ప్రతిష్టాత్మకమైన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే ప్రణాళికలను పరిశీలిస్తోంది. అంతేకాకుండా, ప్రభుత్వ మరియు కార్పొరేట్ అధికారుల కోసం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ప్రత్యేక స్వల్పకాలిక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను ప్రారంభించేందుకు దిగ్గజ ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ కూడా అంగీకరించింది. ఈ కోర్సులు రాబోయే నవంబర్ నుంచే ప్రారంభం కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com