ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- September 02, 2026
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రవాస తెలుగు బాలబాలికల కోసం ప్రత్యేకంగా ‘ప్రవాస బాలల అంతర్జాల సమ్మేళనం’ నిర్వహించనున్నారు. భారతదేశం మినహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న 16 సంవత్సరాల లోపు తెలుగు బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
ఈ ఆన్లైన్ సమ్మేళనంలో కవిత, పద్యం, పాట, కథ, ఏకపాత్రాభినయం తదితర విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నారు. తెలుగు భాష, సాహిత్యం, కళలపై ఆసక్తి ఉన్న ప్రవాస బాలబాలికలను ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమం సెప్టెంబర్ 26, 2026 (శనివారం) నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది.
పాల్గొనదలచిన వారు సెప్టెంబర్ 15, 2026లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అందించిన గూగుల్ ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం రాధిక మంగిపూడి (ఫోన్: +91 9029409696), ఫణి మాధవ్ కస్తూరి (ఫోన్: +91 9121906969)ను సంప్రదించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.


తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







