కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- September 02, 2026
ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ అత్యంత వేగంగా మరియు ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. గత మే 15 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఏకంగా 3,007 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 6,186 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగోలోని ఆరు ప్రధాన ప్రావిన్స్‌లలో ఈ వైరస్ దారుణంగా విస్తరిస్తోంది.
సవాలుగా మారిన కేసుల గుర్తింపు మరియు చికిత్స
కాంగోలో ఎబోలా తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో కొత్త కేసులను సకాలంలో గుర్తించడం వైద్య సిబ్బందికి అత్యంత సవాలుగా మారిందని తెలిపింది. ఈ మహమ్మారి బారిన పడుతున్న వారిలో సరైన సమయంలో వైద్యం అందక, దాదాపు 60 శాతం మంది మరణాలు ప్రత్యేక చికిత్స కేంద్రాల వెలుపలే సంభవించినట్లు డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. వైరస్ కట్టడికి స్థానిక ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు ముమ్మర చర్యలు చేపడుతున్నాయి.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







