ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!

- September 04, 2026 , by Maagulf
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!

రియాద్: సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌కు గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జియోస్ గెరాపెట్రిటిస్ ఫోన్ కాల్ చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే మార్గాలపై ఇరువురు మంత్రులు చర్చించారు.

అలాగే, పరస్పర ఆసక్తి కలిగిన ప్రస్తుత ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఫోన్ సంభాషణలో అభిప్రాయాలు పంచుకున్నారు. సౌదీ అరేబియా–గ్రీస్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపైనా చర్చ జరిగినట్లు అధికారు యంత్రాంగం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com