వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- September 07, 2026
ప్రస్తుతం వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల వైరల్ జ్వరాలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా H1N1 (స్వాన్ ఫ్లూ) కేసులు వేగంగా పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ సోకినా కొన్ని రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఈ ఫ్లూ బారిన పడినప్పుడు తీవ్రమైన జ్వరం, నిరంతర దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు మరియు తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో జీర్ణవ్యవస్థపై ప్రభావం పడి వాంతులు, విరేచనాలు కూడా అయ్యే అవకాశముంది. ఈ లక్షణాలను సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హెచ్1ఎన్1 ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు పలు ముఖ్యమైన సూచనలు చేసింది. జ్వరం, ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే ఇతరులకు సోకకుండా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవాలని స్పష్టం చేసింది. శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఉండేందుకు తగినంత మంచి నీరు, పండ్ల రసాలు మరియు సూప్‌ల వంటి ద్రవాహారాన్ని (లిక్విడ్స్) ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంది. ఒకవేళ ఐదార రోజులు గడిచినా జ్వరం తగ్గకపోయినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినా తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. స్వయం వైద్యం తీసుకోకుండా, సరైన పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఈ ఫ్లూ నుండి రక్షణ పొందే మార్గమని నిపుణులు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







