మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- September 07, 2026
మనామా: ఆరు నెలల పాటు వేతనాలు ఆలస్యం చేసిన ఓ మెడికల్ సెంటర్ కు బహ్రెయిన్ ఫస్ట్ హై లేబర్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓ మహిళా వైద్యురాలికి బకాయి వేతనాలు, వినియోగించని వార్షిక సెలవుల పరిహారంగా కలిపి BD4,072 చెల్లించాలని ఆదేశించింది. సదరు వైద్యురాలు జనరల్ ప్రాక్టీషనర్‌గా నెలకు BD800 వేతనంతో పనిచేశారు.
అయితే ఆరు నెలల పాటు వేతనాలు సక్రమంగా అందకపోవడంతో ఆమె పలుమార్లు యాజమాన్యాన్ని సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె ఉద్యోగాన్ని వదులుకున్నారు. అయితే, ఉద్యోగం నుంచి వైదొలగడాన్ని యాజమాన్యం అంగీకరించినప్పటికీ, ఆమెకు రావాల్సిన ఆర్థిక బకాయిలను మాత్రం చెల్లించలేదు.
కాగా, విచారణ సందర్భంగా బకాయి వేతనాలను ఇప్పటికే చెల్లించినట్లు మెడికల్ సెంటర్ ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొంది. దీంతో వైద్యురాలికి BD3,760 పెండింగ్ సాలరీ చెల్లించాలని ఆదేశించింది.
అదేవిధంగా, వినియోగించని వార్షిక సెలవులకు సంబంధించి BD312 పరిహారం చెల్లించాలని కూడా తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా, ఆమె రెండు సంవత్సరాల ఉద్యోగ సేవా కాలాన్ని పేర్కొంటూ సర్వీస్ సర్టిఫికేట్ జారీ చేయాలని మెడికల్ సెంటర్ ను కోర్టు ఆదేశించింది.
అదే సమయంలో వేతనాల చెల్లింపులో ఆలస్యంపై కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల వరకు ఆలస్యమైన వేతనాలపై సంవత్సరానికి 6 శాతం వడ్డీ వర్తిస్తుందని, ఆ తర్వాత ప్రతి అదనపు నెలకు మరో 1 శాతం చొప్పున పెరుగుతుందని పేర్కొంది. అయితే మొత్తం వడ్డీ రేటు గరిష్ఠంగా 12 శాతం వరకు మాత్రమే ఉండి, పూర్తి చెల్లింపు జరిగే వరకు వర్తిస్తుందని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







