కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!

- September 07, 2026 , by Maagulf
కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!

కువైట్ : కువైట్ లోని కేపిటల్ గవర్నరేట్‌లో భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు చట్ట ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కువైట్ భద్రతా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మొత్తం 257 అరెస్టులు,  చర్యలు, సీజింగ్ లు నమోదైనట్లు క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్ తెలిపింది.

వాంటెడ్ వ్యక్తులను గుర్తించడం, చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం, ప్రజా భద్రత, శాంతిభద్రతలను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ఇక ఈ ఆపరేషన్‌లో భాగంగా నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 57 వదిలివేసిన వాహనాలను తొలగించారు. అలాగే 54 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో  భాగంగా 46 మంది రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనదారులు, అరెస్ట్ వారెంట్లు ఉన్న 38 మంది, తప్పిపోయిన వ్యక్తుల కేసులతో సంబంధం ఉన్న 14 మంది పట్టుబడ్డారు. క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న నలుగురు, సివిల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న ముగ్గురు, పత్రాలు లేని ఇద్దరు కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అలాగే ప్రజా ఆహార, పోషకాహార సంస్థతో కలిసి నిర్వహించిన తనిఖీల్లో పాడైపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న ఓ దుకాణాన్ని గుర్తించి మూసివేశారు. ఉల్లంఘన కేసు నమోదు చేయడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com