దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- September 07, 2026
దుబాయ్: మలయాళీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళీ నేపధ్య, మాప్పిళప్పాట్టు గాయకుడు నిసార్ వయనాడ్ (44) దుబాయ్‌లోని మన్‌ఖూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అజ్మాన్‌లో జరగాల్సిన లైవ్ మ్యూజిక్ షోకి కొన్ని గంటల ముందే ఆయన మరణించడం యూఏఈలోని గల్ఫ్ మలయాళీ కమ్యూనిటీతో పాటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తీవ్ర జ్వరం, సెప్టిసీమియాతో అవయవాల వైఫల్యం
కేరళలోని వయనాడ్ జిల్లా కంబలక్కాడ్‌కు చెందిన నిసార్ వయనాడ్ అసలు పేరు నిస్సార్ అరోత్ ఇబ్రహీం. వివిధ సంగీత కార్యక్రమాల కోసం దుబాయ్‌కి వచ్చిన ఆయన గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ఇన్ఫెక్షన్ తీవ్రమై శరీరంలో సెప్టిసీమియా (Septicemia), యాసిడోసిస్ (Acidosis) వ్యాపించి, అవయవాలు విఫలమవ్వడంతో (Multi-organ Failure) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!







