మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- September 07, 2026
గుజరాత్: 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఈసారి చరిత్ర సృష్టించనుంది. ఏడు దశాబ్దాలకు పైగా ఢిల్లీలోనే జరుగుతూ వచ్చిన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుక తొలిసారిగా దేశ రాజధాని వెలుపల నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని కెవడియా, ప్రస్తుతం National Awards ceremony ఎక్తానగర్ గా పిలుస్తున్న ప్రాంతం ఈ చారిత్రక వేడుకకు వేదిక కానుంది. సెప్టెంబర్ 22న జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.
ఎక్తానగర్‌లో ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ:
1954లో తొలిసారిగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. ఆ తర్వాత దాదాపు అన్ని సంవత్సరాల్లోనూ ఈ కార్యక్రమం దేశ రాజధానిలోనే కొనసాగింది. ఇప్పుడు 72వ ఎడిషన్‌తో ఆ సంప్రదాయానికి తెరపడుతోంది. ఎక్తానగర్‌లో ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉండటం ఈ ఏడాది వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు అంకితం చేసిన ఈ విగ్రహం 597 అడుగుల ఎత్తుతో ఉంది.
ఇక 72వ జాతీయ అవార్డుల విజేతలను ఇప్పటికే జూలైలో ప్రకటించారు. ‘ఆర్టికల్ 370’ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఈ చిత్రంలోని నటనకు యామీ గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ నటుడి అవార్డును మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ సంయుక్తంగా గెలుచుకున్నారు. ‘బ్రహ్మయుగం’, ‘చందు ఛాంపియన్’ చిత్రాల్లో వారి నటనకు ఈ పురస్కారం దక్కింది.
అలాగే ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ డెబ్యూ దర్శకుడిగా ఎంపికయ్యారు. ప్రభాస్ నటించిన తెలుగు సైన్స్‌ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 AD’ ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా అవార్డు అందుకోనుంది. తమిళ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’కు జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ప్రోత్సహించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఢిల్లీకి పరిమితమైన జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుకను తొలిసారి గుజరాత్‌కు తీసుకురావడం భారతీయ సినిమా వైవిధ్యాన్ని దేశవ్యాప్తంగా ప్రతిబింబించే కీలక పరిణామంగా నిలవనుంది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







