దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...
- September 08, 2026
దుబాయ్: దుబాయ్ వేదికగా ఏర్పాటు చేసిన GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ సమ్మేళనం పండగా వాతావరణంలో విజయవంతంగా జరిగింది.
ఈ వేడుకకు దుబాయ్ లోని భారత కాన్సులేట్ లో కాన్సుల్ జనరల్ గా వచ్చిన తొలి తెలంగాణ అధికారి డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరై ప్రవాసీలను ఉద్దేశించి ప్రసంగించారు.
GWAC సైనికులు అన్ని సంబోదిస్తూ వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు, అన్ని గల్ఫ్ సంఘాలు కార్మికుల సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు ఇంకా చేయాల్సిన అవసారాన్ని తెలిపారు, కాన్సులేట్ ఆఫీసుతో క లిసి పనిచేయాలని శనివారం మరియు ఆదివారల్లో కూడ అందుబాటులో ఉంటానని తెలిపారు.
NRI పాలసీ నివేదిక తయారు చేయ్యడం జరిగందని,రాష్ట్ర కేబినెట్ ముందుకు వెళ్ళింది కానీ అమలు లేదని ఆవేదనన వ్యక్తం చేస్తూనే, NRI పాలసీ అమలుకోసం అందరూ కలిసికట్టుగా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సాంస్కృతిక వారసత్వమైన బతుకమ్మ, బోనాలు, జనాపద గీతాలను తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా సగర్వంగా ఆచరించి, ఆసాధ్వించాలని దుబాయిలోని భారతీయ కాన్సుల్ జనరల్ ఇ. విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.
బతుకమ్మ, బోనాలు, జానపద గీతాలు తెలంగాణ సాంస్కృతిక వారసత్వమని దుబాయ్ లోని భారతీయ కాన్సుల్ జనరల్ ఇ.విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీన్ని తెలంగాణ ప్రజానీకం ఎక్కడున్నా సగర్వంగా ఆచరించి, ఆసాధ్వించాలని పిలుపునిచ్చారు. భారతీయ బ్రాండ్‌లో తెలంగాణ సాంస్కృతి ఒక భాగమని ఆయన అన్నారు.
దుబాయ్ లో ఆదివారం తెలంగాణ ప్రవాసీ కార్మిక సంఘం జి.డబ్ల్యు.సి.ఎ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన స్థానిక తెలుగు ప్రవాసీయుల స్థితిగతులపై మాట్లాడిన తీరు ప్రవాసీయులను ఆకట్టుకుంది.ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. నెల రోజుల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రప్రథమంగా ప్రవాసీయులను ఉద్దేశించి ప్రసంగించారు.విదేశాలలోని భారతీయ బ్రాండులో తెలంగాణ బ్రాండు కూడా ఒక ముఖ్య భాగమని అన్నారు. అందుకు తెలంగాణ ప్రవాసీయులు తమ వంతు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఏ రకమైన పరిస్థితుల్లో కార్మికులుగా దుబాయ్ కి వచ్చినా అక్కడున్న సమయంలో కేవలం నిమిత్త కార్మికులుగా మాత్రమే గడపకుండా తమ పనిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో వృత్తిపరమైన నిపుణులుగా ఎదగాలని కాన్సుల్ జనరల్ ఉద్బోధించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, దాన్ని కొనసాగించాలని ఆయన నొక్కి చెప్పారు.
మెరికా, ఐరోపా ఖండాల్లో తెలుగు ప్రవాసీయులు వైద్య, సాఫ్ట్వేర్ నిపుణులుగా గుర్తింపు పొందగా గల్ఫ్ దేశాలలో భారీ సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు ఉన్నప్పటికీ వృత్తిపరంగా ఆ రకమైన విశిష్ఠమైన గుర్తింపు పొందలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తమ వృత్తిలో ఎదిగి రాణించిన అనంతరం పారిశ్రామికవేత్తలుగా లేదా వాణిజ్యవేత్తలుగా ఎదగడం నిజమైన పురోగతిగా గుర్తించాలని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
దుబాయ్-భారత్‌ల మధ్య 150 సంవత్సరాలకు పైగా వలసల చరిత్ర ఉందని, ఈ సుదీర్ఘ కాలంలో అనేక అభివృద్ధితో పాటు కార్మిక సంక్షేమ రంగంలో అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయని కాన్సుల్ జనరల్ చెప్పారు. భారతదేశంలో కూడా ఇమిగ్రేషన్ రంగంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన గుర్తు చేసారు.
కాన్సుల్ జనరల్ మాట్లాడుతూ, రాజ శ్రీనివాస్ రావు(తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్)టీం తో కలసి భారతీయ మిషన్ కమ్యూనిటీ వినతుల పరిష్కార వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ఒక సాంకేతిక సాధనాన్ని (టెక్నాలజీ టూల్) ప్రారంభించే ప్రక్రియలో ఉందని, ఇది ఎమిరేట్స్‌లోని వాలంటీర్ల పనితీరును అంచనా వేయడానికి అలాగే వాలంటీర్ల సేవలకు గుర్తింపు ఇవ్వడం / గౌరవించడం కూడా సహాయపడుతుందని చెప్పారు.
తమ కుటుంబాల ప్రగతి కోసం దుబాయ్ కు వస్తున్న యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రయత్నించాలని విష్ణువర్ధన్ రెడ్డి హితువు పలికారు.
ప్రపంచంలోని అన్ని భారతీయ దౌత్య కార్యాలయాల కంటే దుబాయి భారతీయ దౌత్య కార్యాలయం సంఖ్యాపరంగా కీలకమైందని అన్నారు. అందునా తెలుగు వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండడం, ప్రప్రథమంగా తాను కాన్సుల్ జనరల్‌గా దుబాయ్ కి రావడం సంతోషకరమని ఆయన చెప్పారు.
జి.డబ్ల్యూ.సి.ఎ సంస్థ గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమం, హక్కుల గురించి కొనసాగించిన ఉద్యమాన్ని సంస్థ వ్యవస్తపాక అధ్యక్షుడు కృష్ణ ధోనికెని వివరించారు. గ్రామగ్రామానా ఎన్నారై పాలసీ కోసం తాము చేసిన NRI పాలసీ జెండా ఆవిష్కరణలు, 1000 కిలోమీటర్ల పాదయాత్ర, గల్ఫ్ మృతుల కుటుంబాలకు సహాయం చేస్తున్న విధి విధానాలను ఆయన వివరించారు. ఒక తెలుగు అధికారి దౌత్యవేత్తగా రావాలని తాము కన్న కల సాకారమైనందుకు తమ ఆనందానికి అవధులు లేవని కృష్ణ ధోనికెని భావోద్వేగంతో కన్నీరు పెట్టూకుంటూ చెప్పారు. తమ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన స్పాన్సర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహాయం లేకుండా తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయే వారమని కృష్ణ చెప్పారు.
GWAC అధ్యక్షులు వంశీ గౌడ్ అలాగే GWAC గల్ఫ్ వింగ్ అధ్యక్షులు రవి కటుకం మాట్లాడుతూ GWAC సైనికుల సేవలు గొప్పవని కాన్సుల్ జనరల్ డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డికి దాన్యవాదలు తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి రాత్రింబవళ్ళు కృషి చేసిన GWAC సైనికులను అభినందించి మేమేంటో బాహుకరించి శాలువతో సన్మానించారు. అలాగే స్పాన్సర్లను మరియు గల్ఫ్ సంఘాల నేతలను సన్మానించారు. అనంతరం జరిగిన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో
అన్ని గల్ఫ్ సంఘాల నేతలు, ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రవాసీ ప్రముఖులు అనేక మంది ఇందులో పాల్గొన్నారు.
విశిష్ట అతిథిగా గల్ఫ్ అన్నల ఆడబిడ్డగా హాజరైన తెలంగాణ జానపద గాయని రేలరె గంగా పాడిన తెలంగాణ గేయాలు సభికులను తెలంగాణ పల్లెల ఊహల్లో విహరింపచేశాయి. స్థానికంగా దుబాయ్ గంగపుత్ర సంఘం సభ్యులు వీసా గోస పై ఒక పాటను పాడారు.





తాజా వార్తలు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు
- భారతీయ సంస్థల్లో ఏఐ పెట్టుబడుల జోరు
- దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా షేక్ హమ్దాన్కు 20 ఏళ్లు..
- దుబాయ్ స్క్వేర్ మాల్లో ప్రపంచంలోనే తొలిసారి ఏసీ పార్కింగ్..
- పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు
- ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు వెంకటరత్నం పంతులు ఫోటో ఆవిష్కరణ
- దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 398 మంది విద్యార్థులకు పట్టాలు..
- గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ నమోదు తప్పనిసరి: సీపీ సజ్జనార్







