శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవo..
- August 19, 2016
'అప్పట్లో ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోల ఆధారంగా సినిమా బిజినెస్ జరిగేది. ఇప్పుడు టెక్నాలజీలో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రతి ఒక్కరూ ఫొటోలు తీస్తున్నారు. డిజిటల్ యుగం వచ్చినా, ఫొటోగ్రఫీలో ఎన్ని మార్పులొచ్చినా ఫొటోగ్రాఫర్ స్థానం మాత్రం ఎప్పటికీ పదిలమే' అని దాసరి నారాయణరావు అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ ఫొటోగ్రాఫర్లకు దాసరి చేతుల మీదుగా సత్కారం జరిగింది. అనంతరం దాసరి మాట్లాడుతూ, 'ఇప్పుడు సెల్ఫీ పేరుతో ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తుతున్నారు' అని అన్నారు.'మా రెమ్యూనరేషన్ గత 30ఏండ్లుగా అలానే ఉంది. అసోసియేషన్‌లో చాలా మంది ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. నిర్మాతలు మా పరిస్థితిని అర్థం చేసుకుని రెమ్యూనరేషన్ పెంచాలని కోరుకుంటున్నాం' అని అసోసియేషన్ అధ్యక్షుడు పాల వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్, దామోదర ప్రసాద్, బూర్గుపల్లి శివరామకృష్ణ, శివాజీ రాజా, టి.రామసత్యనారాయణ, అసోసియేషన్ కార్యదర్శి వీరభద్రం, కోశాధికారి రాము తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







