‘సిగ్మా’ నుంచి రేజ్ అఫ్ సిగ్మా సాంగ్ రిలీజ్
- September 09, 2026
లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మాణంలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సిగ్మా . సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు ‘సిగ్మా స్టైల్’, ‘అయ్యయ్యో అమ్మాడి’ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. రెండు పాటలు విభిన్నమైన మూడ్స్‌తో ఆకట్టుకోవడంతో ‘సిగ్మా’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది.
తాజాగా మేకర్స్ రేజ్ అఫ్ సిగ్మా పాటని రిలీజ్ చేశారు. తమన్ అందించిన పవర్ఫుల్ మ్యూజిక్, సీన్ రోనాల్డ్ ఎనర్జిటిక్ వోకల్స్‌తో ‘Rage Of Sigma’ సాంగ్ ఆకట్టుకుంటోంది. విడుదలైన వెంటనే ఈ పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
లైకా ప్రొడక్షన్స్, ఏ. సుభాస్కరన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి తమన్ ఎస్. సంగీతం అందిస్తున్నారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కె.ఎల్.ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, హరిహరసుధన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
తాజా వార్తలు
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్
- మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు







