యూఏఈ నుంచి ‘నో ఇండియా ప్రోగ్రామ్’కు ప్రియదర్శిని ఎంపిక
- September 12, 2026
దుబాయ్: యూఏఈ నుంచి ప్రియదర్శిని తిరుపతిరాజన్ 89వ ‘నో ఇండియా ప్రోగ్రామ్’ (KIP)కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని భారత కాన్సులేట్ హెడ్ఆఫ్ ఛాన్సరీ (HOC) & కాన్సుల్ (కల్చర్) చేతుల మీదుగా ఆమె సర్టిఫికెట్‌ను అందుకున్నారు.
భారతీయ ప్రవాస యువతకు భారత్‌తో మరింత అనుబంధాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నో ఇండియా ప్రోగ్రామ్’లో భాగంగా ప్రియదర్శిని ఎంపికయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు, దేశం సాధిస్తున్న అభివృద్ధి, పురోగతిపై అవగాహన పొందే అవకాశం కలుగుతుంది.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రతో ప్రవాస భారతీయ యువతను అనుసంధానించడమే KIP ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమం ప్రియదర్శినికి ఎంతో విలువైన, జ్ఞాపకంగా నిలిచిపోయే అనుభవాన్ని అందించాలని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!
- బ్రిక్స్ పై గ్లోబల్ సౌత్‌కు నమ్మకం పెరిగింది: ప్రధాని మోదీ
- ఫిలిప్పీన్స్ లో బోటు ప్రమాదం..76కు చేరిన మరణాలు
- న్యూఢిల్లీలో పుతిన్‌తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- BRICS సమ్మిట్..నేటి షెడ్యూల్ ఇదే
- తెలంగాణ అసెంబ్లీ సెషన్: ప్రజా విశ్వాసం బిల్లు-2026 ఆమోదం







