నేపాల్‌లో యూఏఈ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ముమ్మర గాలింపు
- September 12, 2026
ఖాట్మండు: వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్‌లో యూఏఈ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ సహాయక చర్యలను కొనసాగిస్తోంది. నేపాల్ సంబంధిత అధికార యంత్రాంగం, రెస్క్యూ బృందాలతో సమన్వయంతో గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చేపడుతోంది.
తాజాగా ఈ బృందం వరదల్లో గల్లంతైన 10 మందిని గుర్తించింది. దీంతో నేపాల్‌లో తమ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈ రెస్క్యూ బృందం గుర్తించిన గల్లంతైన వారి సంఖ్య 18కి చేరింది.
ప్రధానంగా రసువా, త్రిశూలి నది పరిసర ప్రాంతాలు, అలాగే వరదల ప్రభావానికి గురైన సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధునాతన పరికరాలు, డ్రోన్లతో పాటు వైమానిక సర్వేలు, త్రీడీ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగిస్తూ అనుమానిత ప్రాంతాలను గుర్తిస్తున్నారు. తద్వారా గల్లంతైన వారిని వేగంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఐదో విమానం ద్వారా రెస్క్యూ సామగ్రి
ఇదిలా ఉండగా, యూఏఈ నుంచి నేపాల్‌కు ఐదో మానవతా సహాయ విమానం చేరుకుంది. సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలకు అవసరమైన పరికరాలు, సామగ్రిని ఈ విమానం తీసుకొచ్చింది.
రవాణా చేసిన సామగ్రిలో రెస్క్యూ బోట్లు, డ్రోన్లు, విద్యుత్ పరికరాలు, సాంకేతిక మరియు లాజిస్టికల్ సామగ్రి ఉన్నాయి. వీటిని నేపాల్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలకు అప్పగించనున్నారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, గాలింపు చర్యలను మరింత సమర్థంగా కొనసాగించేందుకు నేపాల్ బృందాలకు సహకారం అందనుంది.
యూఏఈ రిలీఫ్ ఆపరేషన్స్ డైరెక్టర్ హమ్మౌద్ అల్ అఫారీ మాట్లాడుతూ.. యూఏఈ బృందాలు నేపాల్ అధికారులతో కలిసి నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయి ప్రాధాన్యతలు, అందుబాటులో ఉన్న సమాచారానికి అనుగుణంగా సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
గాలింపు చర్యలను కొనసాగించేందుకు నేపాల్ బృందాలకు అవసరమైన పరికరాలు, అత్యవసర సామగ్రిని కూడా అందిస్తున్నామని అల్ అఫారీ వెల్లడించారు. విపత్తులు సంభవించినప్పుడు వేగంగా స్పందించడం, ప్రభావిత దేశాలు, ప్రజలకు అండగా నిలవడం, విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన మానవతా, సహాయక, సాంకేతిక సాయం అందించడం యూఏఈ విధానంలో భాగమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- బహ్రెయిన్‌లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- యూఏఈ స్కూళ్లలో వాట్సాప్ గ్రూపులకు కొత్త రూల్స్..!!
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
- 6 ఏళ్ల తర్వాత దిల్లీకి చైనా విమాన సర్వీసులు ప్రారంభం







