ఖతార్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్‌ అల్‌ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్‌ రెడ్డి భేటీ

- September 12, 2026 , by Maagulf
ఖతార్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్‌ అల్‌ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్‌ రెడ్డి భేటీ

దోహా: ఖతార్‌లో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ కె. శ్రీకర్‌ రెడ్డి.. ఖతార్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్‌ బిన్‌ సాద్‌ అల్‌ మురైఖీతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన తన క్రెడెన్షియల్స్‌ లేఖ ప్రతిని సమర్పించారు.

భారత రాయబారి శ్రీకర్‌ రెడ్డి భారత నాయకత్వం తరఫున సుల్తాన్‌ బిన్‌ సాద్‌ అల్‌ మురైఖీకి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేశారు. అనంతరం ఇరువురు భారత్‌-ఖతార్‌ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

రెండు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, విస్తరించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు.

భారత్‌, ఖతార్‌ మధ్య స్నేహపూర్వక, సుదీర్ఘ సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురు నేతలు కృషి చేయాలని నిర్ణయించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com